భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు అతని పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ కీలక నిర్ణయాన్ని ఎంసీఏ ప్రతినిధులు మంగళవారం మీడియాకు ప్రకటించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య రోహిత్ శర్మ పెవిలియన్ ఆవిష్కరణ జరిగే అవకాశం ఉంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ వార్షిక సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా స్టేడియం స్టాండ్‌లకు క్రికెట్ దిగ్గజాల పేరు పెట్టాలనే ప్రతిపాదనపై అధికారులు చర్చించారు.
భారత క్రికెట్ కు, ముఖ్యంగా ముంబై క్రికెట్‌కు గణనీయమైన సేవలందించిన రోహిత్ శర్మ ఈ గుర్తింపుకు అర్హుడని సభ్యులందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఫలితంగా, వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు అతని పేరు పెట్టాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వివరాలను ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ వెల్లడించారు.