Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్యం సేవించేందుకు భార్య డబ్బులు ఇవ్వలేదని కుమారుడిని చంపేసిన భర్త

Advertiesment
murder
మద్యం సేవించేందుకు భార్య డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఐదు నెలల కన్నబిడ్డను తాగుబోతు భర్త కర్కశంగా చంపేశాడు. ఈ దారుణం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడి తల్లి స్థానిక హోటల్‌లో పని చేస్తోంది. తండ్రి ఇంటి వద్దే ఉంటూ.. ఆ చిన్నారిని చూసుకుంటున్నాడు. ఆకలితో ఏడవడంతో తల్లి దగ్గరికి తీసుకెళ్లాడు. 
 
తిరిగి వస్తున్నప్పుడు మద్యం కోసం ఆమెను రూ.100 అడిగాడు. అందుకు నిరాకరించడంతో కోపంతో బాలుడిని ఇంటికి తీసుకొచ్చేశాడు. అనంతరం కొద్దిసేపటికే చిన్నారి మృతి చెందాడు. గంజాయి మత్తులో తండ్రి చందు విచక్షణ కోల్పోయి గొంతు నులిమి చంపేశాడని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు ఆగ్రహం - క్రిమినల్స్ గుండెల్లో భయం పుట్టాలి... 
 
దేశంలోని అన్ని ప్రాంతాల్లో వరుసగా అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. వీటిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్రిమినల్స్ గుండెల్లో భయం పుట్టించాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించారు. అలాగే, అత్యాచార నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
 
'మహిళల భద్రతకు సంబంధించిన చర్యలు పేపర్లకే పరిమితం కాకూడదు. మేం సురక్షితంగా ఉన్నామని ప్రతి మహిళా భావించేలా మన చర్యలు ఉండాలి. రాత్రి 11 గంటల సమయంలో కూడా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో మహిళలు రోడ్లపై, మెట్రోలో స్వేచ్ఛగా, భద్రంగా తిరిగే పరిస్థితులు కల్పించాలి. నేరాలు జరిగిన తర్వాత ఏం చేశామన్నదానికంటే కూడా.. వాటిని కట్టడి చేయడమే అత్యంత ముఖ్యమైన అంశం. ఇలాంటి నేరం చేస్తే ప్రాణాలు పోతాయి అని క్రిమినల్స్‌ గుండెల్లో భయం పుట్టించినప్పుడే.. వీటిని మనం అరికట్టగలం' అని సుప్రీంకోర్టు వెల్లడించింది.
 
మహిళలపై నేరాల కట్టడికి పోలీసులు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చని న్యాయస్థానం సూచించింది. 'ఈ విషయంలో కొంత కర్కశంగా ఉన్నా వెనుకాడొద్దు. మానవహక్కుల వంటి సమస్యలు ఎదురైనా.. అవసరమైనప్పుడు కఠిన చర్యలు తీసుకోండి' అని కోర్టు పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో నిరంతర పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని న్యాయస్థానం ఈ సందర్భంగా సూచించింది. సీసీటీవీలు నిరంతరం పనిచేసేలా చూడాలని తెలిపింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.30,156 కోట్ల వ్యయంతో జల్ జీవన్ మిషన్ 2.0 ప్రారంభం