Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

Advertiesment
suicide

ఠాగూర్

, గురువారం, 9 జనవరి 2025 (13:29 IST)
తాను చెప్పిన మాట తన తండ్రి వినలేదని మనస్థాపం చెందిన ఓ కుమారుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం, కొట్టాలపల్లిలో ఈ విషాదకర ఘటన జరిగింది. అప్పుల సేద్యం మనకు వద్దు నాన్నా... ఉన్న సంపాదనతోనే బతుకుదాం అంటూ తండ్రికి కుమారుడు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా అతను పెడచెవిన పెట్టాడు. దీంతో మనస్థానానికి లోనైన కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్ద కొట్టాలపల్లికికి చెందిన తిప్ప దుర్గమ్మ దంపతులకు వన్నూరప్ప, హరిక్రిష్ణ, కూతురు సుజాత ఉన్నారు. వన్నూరప్ప, సుజాతకు వివాహం జరిగింది. కొడుకులిద్దరూ రోడ్డు నిర్మాణ పనుల్లో తారు వేసే వాహనం ఆపరేటర్లు. వీరిది ఉమ్మడి కుటుంబం. కొడుకులిద్దరూ తమ సంపాదనను తల్లిదండ్రులకు ఇచ్చేవారు. 
 
వీరికి రెండు ఎకరాల సొంత పొలం ఉంది. ఇదికాకుండా ఏటా 25 నుంచి 30 ఎకరాలు కౌలుకు తీసుకునేవారు. పత్తి, మిరప, శెనగ సహా పలు రకాల పంటలు సాగు చేశారు. ఏటా నష్టాలు వచ్చేవి. ఇద్దరు కొడుకుల సంపాదన కూడా సేద్యానికే ఖర్చయ్యేది. దీంతో కౌలు సేద్యం మానుకోవాలని కొడుకులిద్దరూ తండ్రికి చెప్పేవారు. 
 
ఈ విషయమై మంగళవారం ఉదయం చిన్న కొడుకు హరిక్రిష్ణ(26) తండ్రితో వాగ్వాదానికి దిగాడు. సేద్యం వదిలేందుకు తండ్రి అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. కౌలు పొలంలోకి వెళ్లి విషపు గుళికలు మింగాడు. దీనికి ముందు తన అక్క సుజాతకు ఫోన్ చేశాడు. 'ఎంత చెప్పినా నాన్న మా మాట వినడం లేదు. నాకు బతకాలని లేదు. పొలానికి వచ్చాను. ఆత్మహత్య చేసుకుంటున్నాను' అని చెప్పి ఫోన్ పెట్టే శాడు. 
 
కుటుంబ సభ్యులు వెంటనే పొలానికి వెళ్లి హరిక్రిష్ణను ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆ తండ్రి బోరున విలపిస్తున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)