Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరిచయం ఉన్న అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేయలేదన్న అక్కసుతో ఆమె భర్తను హత్య...

Advertiesment
crime

ఠాగూర్

, మంగళవారం, 13 మే 2025 (10:05 IST)
పరిచయం ఉన్న అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేయలేదన్న అక్కసుతో ఆమె భర్తను హత్య చేసిన ఘటన ఒకటి హైదరాబాద్ నగరంలోని కేపీ‌హెచ్‌బీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... రాజమండ్రి పరిధి కోరుకొండ మండలం ములగాడకు చెందిన కాల్ల వెంకటరమణ (30)కు కాకినాడ పరిధి అడవిపూడికి చెందిన శ్రావణి సంధ్యతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. పిల్లలు లేరు. కేపీ‌హెచ్‌బీ కాలనీ భగత్‌ సింగ్ నగర్‌లో ఫేజ్-1లో ఉంటూ వెంకటరమణ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సమీపంలోని సర్దార్ పటేల్ నగర్‌లో తోడల్లుడు దుర్గా ప్రసాద్ ఉంటున్నాడు. 
 
వీరి భార్యలు వారం క్రితం సొంతూరులో బంధువుల వెళ్లికి వెళ్లారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దుర్గాప్రసాద్ తమ్ముడు జగదీశ్, బావమరిది లక్ష్మీనారాయణలు ఉన్నారు. 12.20 గంటల సమయంలో గది వెనుక ఖాళీ స్థలంలో ఐదుగురు యువకులు గట్టిగా అరుస్తున్నారు. వెంకటరమణ అపార్టుమెంట్ పార్కింగ్ ప్రదేశానికి మధ్యలో కీటికీ మాదిరి ఉన్న గ్రిల్ దగ్గరికి వెళ్లాడు. పంపెన అయ్యప్పనస్వామి అలియాస్ పవన్ (27) గ్రిల్ అవతల ఉండి కత్తితో వెంకటరమణ గుండెల్లో పొడవగా వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. 
 
సుమారు 8 యేళ్లు పవన్‌, శ్రావణి సంధ్యకి పరిచయమైంది. పవన్‌ తన కుటుంబ సభ్యులతో శ్రావణి సంధ్యని తనకిచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులను అడిగించాడు. వారు అంగీకరించలేదు. తర్వాత వెంకటరమణతో వివాహం చేశారు. అప్పటి నుంచి వెంకటరమణను ముట్టుబెట్టేందుకు యత్నిస్తున్నాడు. పథకం ప్రకారం ఆదివారం రాత్రి నలుగురితో వచ్చి అక్కడ తిష్ట  వేశాడు. గొడవు సృష్టించి వెంట తెచ్చుకున్న కత్తితో వెంకటరమణను పొడిచాడు. పవన్ పరారీలో ఉండగా మిగతా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివాహం తర్వాత పవన్, శ్రావణి సంధ్య టచ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు రద్దు