నెల్లూరు పెన్నా బ్యారేజ్ పైన దారుణమైన ఘటన చోటుచేసుకున్నది. గుర్తుతెలియని దుండగులు ఇద్దరు యువకులను అత్యంత కిరాతకంగా హతమార్చి వారి మృతదేహాలను కాలువలో పడేసారు.
ఈ ఘటన అర్థరాత్రి దాటాక 3 గంటల ప్రాంతంలో జరిగి వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ దారుణ హత్యలకు పాల్పడినవారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. సెల్ ఫోన్ టవర్ల సిగ్నళ్లను మానిటర్ చేయడం ద్వారా నిందితుల కదలికలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.