Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహేతర సంబంధం: ప్రియురాలు పరిచయం చేసిన మహిళతో ప్రియుడు కనెక్ట్, అంతే...

Advertiesment
Affair

ఐవీఆర్

, బుధవారం, 8 అక్టోబరు 2025 (16:14 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
బెంగళూరులో విషాదకర సంఘటన జరిగింది. తన స్నేహితురాలిని ప్రియుడికి పరిచయం చేస్తే అతడు కాస్తా ఆమెతో కనెక్టయ్యాడు. తన ప్రియుడితో తన స్నేహితురాలు ఏకాంతంగా వుండటాన్ని చూసి అది తట్టుకోలేని మహిళ ఆత్మహత్య చేసుకున్నది. గురువారం మాగడి రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణాటక హౌసింగ్ బోర్డు కాలనీలోని ఒక లాడ్జ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కామాక్షిపాళ్య నివాసి అయిన మృతురాలు యశోధకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐతే ఈమె గత ఎనిమిది సంవత్సరాలుగా ఆడిటర్ అయిన విశ్వనాథ్‌తో వివాహేతర సంబంధం సాగిస్తోంది. విశ్వనాథ్‌కి కూడా భార్యాపిల్లలు వున్నారు. ఇతడు కూడా అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు.
 
యశోద, విశ్వనాథ్ ఇంట్లో వుండగా యశోద కోసం ఆమె స్నేహితురాలు ప్రియాంక వచ్చింది. ఆమె యశోద కంటే అందంగా వుండటంతో కామాంధుడైన విశ్వానాథ్ కన్ను ప్రియాంక పైన పడింది. మెల్లగా ఆమె ఫోన్ నెంబరు తీసుకున్నాడు. ఆమెను కూడా లైన్లో పెట్టేసాడు. తమ నివాసానికి కాస్తంత దూరంలో వున్న ప్రముఖ హోటల్లో విశ్వనాథ్, ప్రియాంకలు ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. ప్రియాంక తోటిదే లోకంగా గడుపుతున్న విశ్వనాథ్ కాస్తా యశోదను పట్టించుకోవడం మానేశాడు. దీనితో తీవ్ర ఆవేదనకు గురైన యశోద తన ప్రియుడు విశ్వనాథ్ ఎక్కడ వుంటున్నాడని ఆరా తీసింది.
 
ఈ క్రమంలో అతడు తన స్నేహితురాలు ప్రియాంకతో సన్నిహితంగా వుండటమే కాకుండా ఓ హోటల్ గదిలో గడుపుతున్నట్లు తెలుసుకున్నది. దీనితో గురువారం నాడు నేరుగా విశ్వనాథ్-ప్రియాంకలు వున్న గది వద్దకు వెళ్లి తలుపులను గట్టిగా బాదుతూ బయటకు రావాలని పిలిచింది. బైటకు రాగానే ఇద్దరిపైనా వాగ్వాదానికి దిగింది. దీంతో విశ్వనాథ్ సెక్యూరిటీకి కాల్ చేసి ఎవరో ఓ మహిళ తమపై గొడవకు దిగిందనీ, ఆమెను తక్షణం పంపేయాలంటూ చెప్పాడు. 
 
సెక్యూరిటీ సిబ్బంది యశోదను అక్కడి నుంచి వెళ్లిపోవాలనీ, ఏదైనా వుంటే పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు. అసలే వివాహేతర సంబంధం... దీని గురించి పోలీసులకు చెబితే పోయేది తన పరువేనని బాధపడిన యశోద హోటల్ గదికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. హోటల్ సిబ్బంది రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆమెను కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. మాగడి రోడ్ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోహన్ బాబు యూనివర్శిటీ గుర్తింపు రద్దా? మంచు విష్ణు ప్రకటన