Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్కూలుకని చెప్పి ప్రియుడితో సరసాలు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసిన తల్లి ఏం చేసింది (video)

Advertiesment
Mother beaten daughter

ఐవీఆర్

, బుధవారం, 24 సెప్టెంబరు 2025 (16:43 IST)
తెలిసితెలియని వయసులోనే ప్రేమలు. సెల్ ఫోన్లలో వచ్చే సమాచారం మరింత రెచ్చగొడుతుండటం, సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు వాటికి ఆజ్యం పోయడంతో చాలామంది చిన్న వయసులోనే పక్కదారి పడుతున్నారు. ప్రేమ పేరుతో చదువుకునే వయసులోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే...తన కుమార్తె ప్రతిరోజూ పాఠశాలకు వెళ్తుంది. కానీ ఇటీవల కొన్నిరోజులుగా ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది.
 
స్కూలుకని చెప్పి స్కూల్ యూనిఫార్మ్ కాకుండా రంగురంగు దుస్తులను వేసుకుని విపరీతంగా అలంకరించుకుని వెళ్తోంది. దీనితో కుమార్తె వ్యవహారంపై తల్లికి అనుమానం వచ్చింది. దాంతో ఆమె స్కూలుకని చెప్పి వెళ్తుండగా ఆమె వెనకాలే నక్కినక్కి వెంబడించింది. అలా కొంతదూరం వెళ్లాక దారి మధ్యలో ఆ బాలికను ఆమె ప్రియుడు కలిశాడు. ఇద్దరూ కలిసి సమీపంలోని పొలాల్లోకి వెళ్లి సరసాలు మొదలుపెట్టారు. ఈ వ్యవహారం చూసిన బాలిక తల్లి తీవ్ర ఆగ్రహానికి గురైంది.
 
నేరుగా పొలాల్లోకి వెళ్లి కుమార్తెను పట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి విచక్షణారహితంగా కొట్టడం ప్రారంభించింది. కుమార్తెపై దాడి చేస్తుండటంతో అటుగా వెళ్లేవారు ఆమెను అడ్డుకున్నారు. బాలికపై దాడి చేయకుండా రక్షించారు. కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. చదువుకునేందుకు వెళ్లే బాలిక ఇలాంటి పని చేయడమేంటని ఒకరు కామెంట్ చేయగా... ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలనీ, అసలు పాఠశాలల్లో చిన్నవయసులో దారి తప్పుతున్న బాలబాలికల ఘటనలకు సంబంధించి విషయాలను తెలియజేస్తే వారు ఇలాంటి రొంపిలో పడరంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు