Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20 గుంటల భూమి కోసం.. ఇద్దరు మైనర్ కుమారులకు విషం కలిపిన బిస్కెట్లు ఇచ్చిన తండ్రి.. ఎక్కడ?

Advertiesment
Crime news
Crime news
20 గుంటల భూమి కోసం కన్నతండ్రి కిరాతకుడిగా మారాడు. భూమి కోసం తన మొదటి భార్య బిడ్డలు మైనర్లైనా ఆ కిరాతకుడు వదల్లేదు. ఈ క్రమంలో విషం కలిపిన బిస్కెట్లను మైనర్ కుమారులకు ఇచ్చి కన్నతండ్రే హతమార్చాడు.  ఈ దిగ్భ్రాంతికరమైన కుట్ర, జనగాం జిల్లాలోని రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బ తండాలో వెలుగుచూసిందని పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. నిందితుడైన బానోత్ శ్రీనివాస్ (35) 2016లో తన మొదటి భార్య అనితను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు (ఇద్దరూ 10 ఏళ్లలోపు వారే). అయితే, కుటుంబ కలహాల కారణంగా, శ్రీనివాస్ ముడవత్ మమత అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ వివాదానికి మూలకారణం, అతని మొదటి భార్య ద్వారా కలిగిన ఇద్దరు కుమారుల పేర్ల మీద ఉన్న 20 గుంటల భూమి. 
 
ఈ భూమిని సొంతం చేసుకునేందుకు అథని రెండో భార్య ప్రోత్సాహంతో,  ఆ ఆస్తిని తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఆ పిల్లలను హతమార్చాలని శ్రీనివాస్ నిర్ణయించుకున్నట్లు ఆ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆ పిల్లలకు విషం కలిపిన బిస్కెట్లు తినిపించి చంపేందుకు ఆ దంపతులు ఒక కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దుర్మార్గాన్ని అమలు చేసేందుకు, వారు స్థానికంగా ఉన్న ఒక గ్రామస్తుడిని సంప్రదించి, ఆ హత్యలు జరిపినందుకు గాను అతనికి సుపారీ ఇచ్చారు. 
 
అయితే ఈ వ్యక్తి భయంతో ఆ కుట్ర మొత్తాన్ని గ్రామస్తుల ముందు బయటపెట్టాడు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రఘునాథపల్లి పోలీసులు శ్రీనివాస్‌ను, అతని రెండవ భార్య మమతతో సహా అరెస్టు చేశారు. వీరిద్దరినీ జనగాం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో తీవ్రమైన వడగాలులు.. తొలిసారిగా 42 డిగ్రీల మార్కుకు ఉష్ణోగ్రతలు