Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Advertiesment
Vipin and Nikki

ఐవీఆర్

, మంగళవారం, 26 ఆగస్టు 2025 (16:23 IST)
అదనపు వరకట్నం కోసం నిక్కీ అనే వివాహితను ఆమె భర్త దహనం చేసాడన్న ఆరోపణల నేపధ్యంలో పోలీసులకు ఈ కేసు చిక్కుముడిలా తయారైంది. ఈ సంఘటన నిక్కీకి వున్న రీల్స్ తయారు చేసే అలవాటు వల్ల జరిగిందా? అనే వాదనలు కూడా వినబడుతున్నాయి. ఒకవైపు, నిక్కీ తల్లిదండ్రులు నిక్కీ భర్త విపిన్ భాటి కట్నం కోసం తమ కుమార్తెను దహనం చేశాడని ఆరోపిస్తుండగా, విపిన్ పొరుగువారు మాత్రం అతనిని సమర్థిస్తున్నారు. ఇంకోవైపు విపిన్‌కి మరో మహిళతో వివాహేతర సంబంధం వున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాధిత మహిళ ఇతడిపై 2004లో కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.
 
సోషల్ మీడియాలో రీల్స్ తయారు చేసే నిక్కీ అలవాటుపై వివాదం కూడా తెరపైకి వస్తోంది. పోలీసుల దర్యాప్తు తర్వాతే నిజం ఏమిటో తెలుస్తుంది, కానీ ప్రస్తుతానికి గ్రేటర్ నోయిడాకు చెందిన ఈ హై-ప్రొఫైల్ కేసు చిక్కుముడిలా ఉంది. అయితే, ఈ మొత్తం కేసు గురించి కూడా అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కంచన్ తన సోదరి నిక్కీ మంటల్లో చిక్కుకుని తగలబడుతుంటే ఆ మంటలను ఆర్పాల్సింది పోయి ఆ వీడియోను ఎందుకు తీస్తోంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే కంచన్‌కు రీల్స్ తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం బాగా అలవాటు. మరోవైపు నిక్కీ తను బ్యూటీ పార్లర్ నడుపుతానంటూ భర్త విపిన్‌తో వాదనకు దిగినట్లు చెబుతున్నారు. ఇలా ఈ హత్య కేసు చుట్టూ అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
ఈ హత్య కేసులో వరకట్నం మాత్రమే కాకుండా అనేక ఇతర కారణాలు తెరపైకి వస్తున్నాయి. నిక్కీ అనేక రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిక్కీ అత్తమామలు ఆమె రీల్స్ తయారు చేయడం ఇష్టపడలేదు. బ్యూటీ పార్లర్ నడపడం గురించి కుటుంబంలో గొడవ కూడా జరిగింది. భర్త విపిన్ భాటి వ్యవహారం గురించి కూడా వార్తలు వచ్చాయి. ఇంతలో, ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు నలుగురుని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో భర్త, అత్త, మామ, ఆమె బావ వున్నారు.
 
నిక్కీ అత్తమామలు నిక్కీని తగలబెట్టి చంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లక్షల రూపాయలు కట్నం పొందిన తర్వాత కూడా బుల్లెట్, స్కార్పియో ఇచ్చిన తర్వాత కూడా భర్త విపిన్ నిక్కీ పట్ల దారుణంగా ప్రవర్తించేవారని చెబుతున్నారు. నిక్కీ సోదరి కాంచన్ కూడా ఒకే కుటుంబంలో వివాహం చేసుకున్నారు. కాంచన్ చెబుతున్న వివరాల ప్రకారం, నిక్కీ అత్తమామలు విపిన్‌ను మళ్ళీ వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. వారు నిక్కీని వదిలించుకోవాలని కోరుకున్నారు. వారు నిక్కీని ఇంటి నుండి వెళ్లిపోవాలని కోరుకున్నారు. ఆమెను కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా కొట్టారు, దీని కారణంగా ఆమె రోజంతా అపస్మారక స్థితిలో ఉంది.
 
ఈ విషయానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో నిక్కీని కొట్టి లాగుతున్నట్లు చూపబడింది. ఆమె మంటల్లో చిక్కుకుని కాలుతూ మెట్లు దిగుతున్నట్లు చూపబడింది. నిక్కీ మంటల్లో కాలిపోతున్నప్పుడు కాంచన్ ఆమె సోదరిని రక్షించే బదులు, నిక్కీ కాలిపోతున్న వీడియో ఎందుకు తీశారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన