Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌ నగరంలో ఇంటర్ విద్యార్థిని హత్య చేసి రౌడీ గ్యాంగ్

Advertiesment
murder
హైదరాబాద్ నగరంలోని కాలాపత్తర్‌ పరిధిలో ఓ ఇంటర్‌ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కాలాపత్తర్‌ పోలీసులు, బాధిత కుటుంబీకుల వివరాల ప్రకారం.. బిర్యానీషా టెక్రీకి చెందిన ఎజాజ్‌ మహ్మద్‌ (45) సౌదీలో డ్రైవర్‌. అతడి పెద్దకుమారుడు ఫైజాన్‌(18) ఎలియాస్‌ అజాన్‌తోపాటు ఇద్దరు కుమార్తెలు, భార్య స్థానికంగా ఉంటున్నారు. శాలిబండలోని ఓ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న ఫైజాన్‌ తన మిత్రులు అమేర్‌(19), సాహిల్‌ (19)తో కలిసి ఆదివారం తెల్లవారుజామున బిర్యానీషాటెక్రీ కొండ ప్రాంతానికి చేరుకున్నాడు. 
 
అదేసమయంలో బాలాపూర్‌ రౌడీషీటర్‌ అబ్రార్‌(22), అతడి మిత్రులు జేబుదొంగ ఫర్హాన్‌ (21), అశ్వాక్‌(22)తో కలిసి అక్కడికి వచ్చాడు. తమ బస్తీకి ఎందుకు వచ్చారని రౌడీషీటర్‌ అబ్రార్‌ను ఫైజాన్‌ ఎదిరించాడు. వాని మధ్య వాగ్వాదం కొనసాగుతుండగానే.. ఫర్హాన్‌ తన కత్తితో ఫైజాన్‌ తలపై వేటు వేశాడు. అదే కత్తితో అతడి కడుపు, ఇతర భాగాల్లో అబ్రార్‌ పొడిచాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. తమ అల్లుడు ఫైజాన్‌ను వ్యక్తిగత కక్షతో అబ్రార్‌ రౌడీగ్యాంగ్‌ దాడిచేసిందని మృతుడి మామ సాకీర్‌ కాలాపత్తర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్క కుమార్తె మొబైల్‌కు అశ్లీల వీడియోలు.. అసభ్యకర సందేశాలు...