Daily Horoscope

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి చేసుకోకపోతే ఫ్యానుకు ఉరేసుకుంటానంటూ ప్రియుడికి వార్నింగ్.. అన్నంత పని చేసిన ప్రియురాలు

Advertiesment
suicide
తనను పెళ్లి చేసుకోకపోతే ఇపుడే ఫ్యానుకు వేలాడుతానంటూ ప్రియుడికి వీడియో కాల్‌లో చున్నీ చూపించి బెదిరించిన సాఫ్ట్‌వేర్ ప్రియురాలు... చివరకు అన్నంత పని చేసి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్చన చౌదరి మాలిక్ (29) మాదాపూర్ చందానాయక్ తుండాలోని ఎస్ఆర్ రెసిడెన్సీలో నివసిస్తూ ఓ ప్రైవేట్ సంస్థలో సీనియర్ అసోసియేట్‌గా పని చేస్తున్నారు. బొల్లారంలో నివసించే ఉత్తరాఖండ్‌కు చెందిన సహోద్యోగి, వివాహిడు అయిన భండారి విమల్‌తో ఆమెకు నాలుగేళ్లుగా సాన్నిహిత్యం వుంది. 
 
శనివారం అర్థరాత్రి 2.30 గంటలకు విమల్ తన తల్లితో కలిసి చేర్యాలకు ఓ శుభకార్యం నిమిత్తం వెళుతుండగా, అర్చన నుంచి వీడియోకాల్ వచ్చింది. ఫ్యానుకు కట్టిన చున్నీని చూపిస్తూ, తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి కాల్ కట్ చేసింది. ఆ తర్వాత ఆమెకు విమల్ పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. 
 
దీంతో ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు విమల్ ఆమె నివాసానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి కేసు చూసే సరికి అర్చనా చౌదరి ఉరేసుకుని మృతిచెంది కనిపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్చనా సౌదరితో సంబంధఁ నేపథ్యంలో విమల్ తన భార్యతో విడాకులకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Hyderabad: దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్... బాల్య వివాహాన్ని అలా అడ్డుకున్నారు...