Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళపై అత్యాచారం.. ప్రతిఘటించడంతో కొట్టి చంపేసిన కిరాతకులు...

Advertiesment
murder

ఠాగూర్

, మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (19:06 IST)
హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ మహిళ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. కిస్మిత్‌పూర్‌లో ఈ మహిళ హత్యకు గురైంది. ఈ కేసులో ఇద్దరు ఆటో డ్రైవర్లు, ఒక కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళపై మొదట కారు డ్రైవర్, ఆ తర్వాత ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. కిరాతకులు అత్యాచారానికి ప్రయత్నించగా, ఆ మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెను కొట్టి చంపేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు నేర చరిత్ర ఉన్నట్టు తేలింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ కేసులో గులాం దస్తగిరి ఖాన్ (26), మొహ్మద్ ఇమ్రాన్ (25) అనే ఆటో డ్రైవర్లతో పాటు మేక దుర్గా రెడ్డి అనే కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులుగా కనిపించకుండా పోయిన బాధిత మహిళ ఈ నెల 14వ తేదీన మద్యం మత్తులో ఉండగా కారు డ్రైవర్ దుర్గా రెడ్డి కంట పడింది. ఆమెను మాయమాటలతో నమ్మించి తన వాహనంలో ఎక్కించుకున్నాడు. ఆమెకు బీరు, బిర్యానీ కొనిచ్చి సత్మరాయ్‌లోని ఓ ఫంక్షన్ హాలు సమీపంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆరాంఘర్ చౌరస్తా వద్ద పిల్ల నంబర్ 306 వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. 
 
ఆ సమయంలో అక్కడే ఉన్న ఆటోడ్రైవర్లు దస్తగిరి, ఇమ్రాన్‌లు ఒంటరిగా ఉన్న మహిళను బలవంతంగా తమ ఆటోలో ఎక్కించుకున్నారు. కిస్మత్‌పూర్ బ్రిడ్జివద్దకు తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితుడు దస్తగిరి ఖాన్ కర్రతో విచక్షణా రహితంగా ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పొదల్లో పడేసి అక్కడ నుంచి పరారయ్యారు. 
 
రెండు రోజుల తర్వాత స్థానికులు కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన రాజేంద్ర నగర్ పోలీసులు... సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ మహిళను తీసుకెళ్లిన ఆటో నంబరును గుర్తించి, ఇద్దరు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాన్ని వెల్లడించారు. వారిచ్చిన సమాచారంలో మహిళను మొదట ఆరాంఘర్ వద్ద వదిలివెళ్లిన కారు డ్రైవర్ దుర్గారెడ్డిని కూడా అరెస్టు చేశారు. విచారణలో నేరం చేసినట్టు కారు డ్రైవర్ కూడా అంగీకరించాడు. దీంతో ఈ ముగ్గురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రైవేటు ఆస్పత్రుల్లో 90 శాతం సిజేరియన్ ఆపరేషన్లు : సీఎం చంద్రబాబు ఆందోళన