Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నువ్వు ప్రేమికుడివి మాత్రమే, పెళ్లి నీతో కాదు: ప్రియుడు ఆత్మహత్య

Advertiesment
Love failure

ఐవీఆర్

, మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (17:44 IST)
ఆమె సర్వస్వం అంటూ గడిపిన ప్రియుడికి ప్రియురాలు షాకిచ్చింది. ప్రేమించుకోవడం వరకే కానీ పెళ్లి మాత్రం నీతో కాదని బలంగా చెప్పేసింది. అది తట్టుకోలేని ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటక లోని హాసన జిల్లా అరసికెర తాలూక బైరగొండనహళ్లికి చెందిన 22 ఏళ్ల దర్శన్ డిగ్రీ చదువుతున్నాడు. ఇతడికి అదే గ్రామానికి చెందిన యువతితో స్నేహం వుంది. ఇది కాస్తా ప్రేమగా మారింది.
 
గత ఐదేళ్లుగా వీళ్లిద్దరూ ప్రేమలో వున్నారు. డిగ్రీ పూర్తయ్యింది. ఉద్యోగం రాలేదు. దీనితో దర్శన్ వ్యవసాయం చేసుకుంటున్నాడు. కాలేజీకి వెళ్లే రోజుల్లో ప్రతిరోజూ ప్రియురాలితో గడిపే అవకాశం వుండేది. కానీ చదువు ముగిసాక ఆమెను కలిసే అవకాశం తగ్గిపోయింది. ఆమె కూడా ఇతని పట్ల క్రమంగా దూరంగా జరుగుతోందా అనే అనుమానం వచ్చింది. దీనితో ఫిబ్రవరి 5న ప్రియురాలిని కలిశాడు. మనం పెళ్లి చేసుకుందాము అంటూ అడిగాడు. అందుకు ఆమె ఎంతమాత్రం అంగీకరించలేదు.
 
పెళ్లి మాట ఎత్తవద్దని గట్టిగా చెప్పేసింది. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన దర్శన్ పొలంలో పురుగులను చంపే రసాయాన్ని తాగేసాడు. దాంతో అతడికి వాంతులు, విరేచనాలు అవుతుండటంతో స్నేహితులు అతడిని ఆసుపత్రికి తరలించారు. తనను తన ప్రియురాలు మోసం చేసిందనీ, ఆమె లేకుండా తను బ్రతకలేననీ, అందుకే చనిపోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు తాగినట్లు స్నేహితులకు చెప్పాడు. ఆసుపత్రిలో చికిత్స చేసి బ్రతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అతడు కన్నుమూసాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంగరాయ వైద్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య - సూసైడ్ వీడియో