Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సొంతంగా పార్టీ పెడతా... ఎవరు?

రాజకీయాల్లో ఓ పదేళ్ళు అనుభవం ఉంటే చాలు.. చాలా మంది సొంతంగా పార్టీ పెట్టేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రధాన రాజకీయాల పార్టీలో ప్రజాప్రతినిధులు ఉండి వారికి ఎక్కడైనా చేదు అనుభవం ఎదురైతే ఇక చెప

Advertiesment
bojjala gopalakrishna reddy
, గురువారం, 6 ఏప్రియల్ 2017 (15:15 IST)
రాజకీయాల్లో ఓ పదేళ్ళు అనుభవం ఉంటే చాలు.. చాలా మంది సొంతంగా పార్టీ పెట్టేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రధాన రాజకీయాల పార్టీలో ప్రజాప్రతినిధులు ఉండి వారికి ఎక్కడైనా చేదు అనుభవం ఎదురైతే ఇక చెప్పనక్కరల్లేదు. వారికి అన్ని తెలుస్తుంది కాబట్టి ఇక మనమే సొంతంగా పార్టీ పెట్టేద్దామని బయటకు వచ్చేస్తుంటారు. ఇదే చేయబోతున్నారు మాజీ మంత్రి, తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నిర్ణయం ఇప్పటికే తీసేసుకున్నారట. తాను పార్టీ పెడితే చాలామంది నేతలు రావడానికి సిద్ధంగా ఉన్నారన్నది బొజ్జల అభిప్రాయం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
 
కొత్త కేబినెట్‌లో తీవ్ర పరాభవం ఎదుర్కొన్న మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఒక్కసారిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధినేతకే పంపించేశారు. అది కూడా కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ప్రారంభం కాకముందే. బొజ్జల వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాబుకు అత్యంత సన్నిహితుడు బొజ్జలకే ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే ఇక మిగిలిన వారి గురించి చెప్పనవసరం లేదంటున్నారు ఆ పార్టీ నేతలే. 
 
గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారట. సొంతంగా పార్టీ పెట్టుకుంటే మంచిదని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీ ఈ పార్టీలోకి వెళ్ళడం మంచిది కాదన్నది బొజ్జల అభిప్రాయం. ఇదే మంచిదని బొజ్జల తనయుడు సుధీర్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఇంకేముంది బొజ్జల పార్టీ పెడతారన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైలో విమానాలు ఎలా ఎగురుతాయో... దిగుతాయో మేం చూస్తాం : శివసేన ఎంపీల దాదాగిరి