Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూగజీవులకు దేవుడు, 7000 జంతువులను రక్షించిన హైదరాబాద్ నివాసి

Advertiesment
Hyderabad man
, శనివారం, 12 డిశెంబరు 2020 (17:29 IST)
గ్రామంలో పుట్టి పెరిగిన ప్రదీప్ నాయర్‌కు ప్రకృతితో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ఆయన బి.టెక్ పూర్తిచేసుకున్న తరువాత సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేయడానికి హైదరాబాదుకు వచ్చారు. పెద్ద నగరాలలో జంతువుల దుస్థితి ఆయనను ఎంతో నొప్పించింది. ఆయన జంతువులను బావులలో, గొయ్యిలలో పడటం, పక్షులు మాంజాలలో చిక్కుకుపోవడం చూసారు. ఆయన ఎన్నో సంస్థలకు తన సేవలను అందించారు.
 
కానీ, జంతు రక్షణకు అవసరమైన శిక్షణ చాలా తక్కువ మందికి ఉందని గమనించారు. అప్పటినుంచి, ఆయన కష్టాలలో ఉన్న జంతువులను రక్షించడానికి అవసరమైన నైపుణ్యాన్ని సంపాదించారు. ప్రదీప్ మాట్లాడుతూ, "ఒక రోజు, ఒక చిన్న బావిలో గర్భంతో ఉన్న కుక్క పడిపోయిందని మాకు ఫోను వచ్చింది. మేము వెళ్ళి మెల్లగా దాన్ని రక్షించి, దాన్ని ఒక షెల్టర్‌కు పంపాము. ఒక వారం తరువాత, అది 2 - 4 పిల్లలకు జన్మనిచ్చింది. అది నా జన్మలో అన్నిటికంటే మధురమైన అనుభూతి. అవి నా పిల్లలు అని నేను భావిస్తాను." 
Hyderabad man

 
ప్రదీప్ "ఆనిమల్ వారియర్స్ ఇండియా"ని 2015లో ఎన్నో మూగ జంతువులకు సహాయం అందించడానికి స్థాపించారు. ఈ సంస్థ లక్ష్యం మరింత మంది యువకులను నిజమైన జంతు సంరక్షణ కార్యకర్తలను రూపుదిద్దడం. ఆయన మంచి శిక్షణను కల్పించి, 18 మంది రక్షకులను తయారుచేసారు. వీళ్ళు నగరంలో ఉన్న సంస్థలతో పని చేస్తూ ఉంటారు.
 
"పాకెట్ షెల్టర్" అనే వినూత్న పద్ధతిని స్థాపించారు. జంతు సంరక్షణా సంస్థలపై భారాన్ని తగ్గించడానికి, ఆయన రక్షించిన జంతువులను కొందరి ఇళ్ళలో పెట్టి, వాటిని రక్షిస్తారు. దీనివల్ల నగర పౌరులలో ఒక బాధ్యతను కలింగించగలము అని ఆయన నమ్ముతున్నారు. గత 14 సంవత్సరాలలో పిల్లులు, కుక్కలు, బర్రెలు, పక్షులు, పాములు వంటి 7000కు పైగా జంతువులను రక్షించారు. 
Hyderabad man
ప్రదీప్ మరియు ఆయన సంస్థలోని రక్షకులు కలిసి ప్రకృతి వైపరిత్యాలలో జంతువులను రక్షిస్తారు. వైజాగ్ తుఫాను, కేరళ వరదలలో ఎన్నో మూగజీవులను రక్షించారు. భారతదేశంలో లాక్డౌన్ మొదలైనప్పటినించి, నలుమూల ప్రాంతాలలో, పర్యాటక ప్రాంతాలలో ఉన్న జంతువులకు ఆహారం అందిస్తున్నారు.
Hyderabad man
ఇన్ని సంవత్సరాలలో వారు రక్షణకు వాడే పరికరాలు పాతగా అయిపోవడం వల్ల, ప్రదీప్ వారి 3 టీంలకు కావలసిన పరికరాలు, ప్రత్యేక వాహనాలు సేకరించాలని అనుకుంటున్నారు. నిధుల కొరత ఉన్నా, ప్రదీప్ నిరాశపడలేదు. ప్రపంచంలోని జంతు ప్రేమికుల నుంచి సహాయం పొందడానికి ఆయన దక్షిణ ఆసియాలోని అతి పెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫాం మిలాప్‌లో కాంపైన్ మొదలు పెట్టారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుళ్లు