Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాన్నా... రాజకీయాల్లోకి దూసుకెళ్తానంటున్న యువ హీరో...

మంచు.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చేది మోహన్ బాబు కుటుంబం. మంచు విష్ణు, మంచు మనోజ్‌, మంచు లక్ష్మి ఇలా అందరికీ ఇంటి పేరు ఉంటుంది. కానీ వీరిలో ఎవరికి వారే సెపరేట్ స్టామినాతో వుంటారు. అయితే మోహన్ బాబు చిన్న కుమారుడు గత కొన్నిరోజులుగా రాజకీయాల వైప

Advertiesment
manchu manoj ready to enter in politics
, శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (15:11 IST)
మంచు.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చేది మోహన్ బాబు కుటుంబం. మంచు విష్ణు, మంచు మనోజ్‌, మంచు లక్ష్మి ఇలా అందరికీ ఇంటి పేరు ఉంటుంది. కానీ వీరిలో ఎవరికి వారే సెపరేట్ స్టామినాతో వుంటారు. అయితే మోహన్ బాబు చిన్న కుమారుడు గత కొన్నిరోజులుగా రాజకీయాల వైపు రావాలని నిర్ణయించుకున్నాడట. నారా లోకేష్‌, జగన్ మోహన్ రెడ్డిలను దగ్గరగా చూసిన మనోజ్‌కు రాజకీయాల వైపు గాలి మళ్లిందని ఆయన స్నేహితులే చెబుతుండడం గమనార్హం.
 
దీంతో మంచు మనోజ్ తన తండ్రికి ఈ విషయాన్ని గత కొన్నిరోజుల ముందు చెప్పుకొచ్చాడట. మోహన్ బాబు వెంటనే మనం ఎలాగో తెలుగుదేశంలో చేరుతున్నాము కదా.. చూద్దాం... మనకు మంచి అవకాశమొస్తే దూసుకెళదాం అన్నాడట. ప్రస్తుతం టిడిపిలో యువ నేతలు పెద్దగా లేరు. ప్రతి ఒక్కరు నారా లోకేష్‌ జపం మాత్రమే చేస్తుంటారు. ఇక చెప్పుకునే యువ నేతలు అస్సలు లేరు. అందుకే యువ నేతగా ముందుకెళ్ళాలన్నదే మంచు మనోజ్‌ ఆలోచనట. 
 
మోహన్ బాబు వెయిట్ చెయ్యి అంటే మంచు విష్ణు, మంచు లక్ష్మి మాత్రం రాజకీయాలు మనకు వద్దురా తమ్ముడూ అని బుజ్జగించినట్లు తెలుస్తోంది. అయితే స్వతహాగా మంచు మనోజ్ ఎవరి మాటా వినరట. తను అనుకున్నది చేసి తీరడమే ఆయనకు ఇష్టమట. తండ్రి తప్ప ఎవరు ఏం చెప్పినా అస్సలు పట్టించుకోరట. దీంతో వారిద్దరు చెప్పిన మాటలను ఈ చెవిన విని.. ఆ చెవిన వదిలేశారట మంచు మనోజ్. మొత్తంమీద ఒక యువ హీరో రాజకీయాల్లోకి రావడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది. 2019లో మంచు ఏపీ రాజకీయాలను ఎంతమేరకు కమ్మేస్తాడో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అట్టహాసంగా జయలలిత 69వ జయంతి.. పార్టీ అధిష్టానమే మా చేతికి వస్తుంది: ఓపీఎస్