Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరలక్ష్మి వ్రత పూజ పురస్కరించుకుని హైదరాబాద్ స్టోర్‌లో త్యాని బై కరణ్ జోహార్ ప్రత్యేక కలెక్షన్‌

Advertiesment
Gold Jewelry

ఐవీఆర్

, మంగళవారం, 6 ఆగస్టు 2024 (17:13 IST)
వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకుని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన, లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్‌ను విడుదల చేసినట్లు త్యాని బై కరణ్ జోహార్ వెల్లడించింది. ఈ అద్భుతమైన కలెక్షన్ జూబ్లీహిల్స్‌లోని తమ హైదరాబాద్ స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంచారు. విభిన్న వ్యక్తుల అభిరుచులు, ప్రాధాన్యతలను తీర్చడానికి రూపొందించబడిన ఈ అద్భుతమైన ఆభరణాలు, ప్రతి వ్యక్తి తమ పరిపూర్ణ ఆభరణం కనుగొనగలరనే భరోసా అందిస్తుంది.
 
ఈ కలెక్షన్లో మామిడి మాలలు ఉన్నాయి. ప్రతి ఆభరణం శ్రేయస్సు, అందానికి ప్రతీకగా చక్కగా రూపొందించబడింది, పవిత్రమైన వరలక్ష్మి పూజను అవి పరిపూర్ణం చేస్తాయి. సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, వేడుక జరుపుకోవడంలో త్యాని యొక్క అంకితభావం ఈ డిజైన్లలో ప్రకాశిస్తుంది. పాతకాలపు వైభవాన్ని ఇష్టపడే వారి కోసం, ఈ కలెక్షన్‌లో విక్టోరియన్-ప్రేరేపిత ఆభరణాలు కూడా ఉన్నాయి. విక్టోరియన్ శైలిలోని గాంభీర్యం, అధునాతనత యొక్క సారాంశాన్ని ఒడిసి పట్టే రీతిలో ఇవి రూపొందించబడ్డాయి. ఈ కలెక్షన్‌లో లగ్జరీ, ప్రకాశాన్ని వెదజల్లే ప్రత్యేకమైన డైమండ్ డిజైన్‌లు కూడా ఉన్నాయి. 
 
webdunia
త్యానీకి చెందిన శ్రీ రిషబ్ మాట్లాడుతూ, "వరలక్ష్మి వ్రత పూజ వేళ ఈ ప్రత్యేకమైన కలెక్షన్ విడుదల చేయటం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఈ కలెక్షన్ లోని ప్రతి ఆభరణం, ఆధునిక సౌందర్యంతో సాంప్రదాయ అంశాలను మిళితం చేసేలా ఆలోచనాత్మకంగా రూపొందించబడింది. ఈ కలెక్షన్ వారి వేడుకలకు ప్రత్యేక సొబగులు, వైభవాన్ని జోడిస్తుందని నమ్ముతున్నాను" అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రెయిన్ పవర్ పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?