Publish Date: Fri, 26 Feb 2021 (21:13 IST)
Updated Date: Fri, 26 Feb 2021 (21:14 IST)
బొంబాయి రవ్వ ఉప్మా భారతదేశం ఫేవరెట్ అల్పాహారం. ఇడ్లీల మాదిరిగానే, ఇది కూడా దక్షిణ భారతదేశానికి చెందినది. ఉప్మా తయారీకి ఉపయోగించే రవ్వలో ప్రోటీన్, విటమిన్ బి, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఉప్మాకు వెజ్జీలను జోడించడం వల్ల రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఉప్మాను ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ - 1 కప్పు
అల్లం తురుము - 1 స్పూన్
పచ్చిమిర్చి తరుగు - 2 స్పూన్స్
కరివేపాకు - 2 రెమ్మలు
జీడి పప్పు - 1 స్పూన్
ఉప్పు - సరిపడా
ఆవాలు - స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
పచ్చి సెనగ పప్పు - 1 స్పూన్
మినప్పప్పు - 1 స్పూన్
నూనె - తగినంత
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసుకుని కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి నీళ్లు మరిగించాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా వేస్తూ ఆపకుండా కలుపుకోవాలి. చివరగా జీడిపప్పులు వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే ఉప్మా రెడీ.
సిహెచ్
Publish Date: Fri, 26 Feb 2021 (21:13 IST)
Updated Date: Fri, 26 Feb 2021 (21:14 IST)