Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి 2024: ట్రెండింగ్‌లో సాంగ్స్.. కథా నేపథ్యం ఏంటి?

Advertiesment
Diwali

సెల్వి

, గురువారం, 31 అక్టోబరు 2024 (09:07 IST)
Diwali
భారతదేశం పండుగల భూమి. దీపావళి అత్యంత ప్రతిష్టాత్మకమైన పండుగల్లో ఒకటి. ఈ దీపావళిని దేశవ్యాప్తంగా అపారమైన ఉత్సాహంతో జరుపుకుంటారు. దేశం అంతా గురువారం దీపావళి జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి.. నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ. 
 
రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. 
 
చతుర్దశి నాడు నరకుడి మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అన్ని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు.. కార్తీక శుద్ద విదియ 'భగినీహస్త భోజనం'’తో ముగుస్తుంది.
 
ఈ పండుగ దేశ సమైక్యతకు నిదర్శనం. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమాని 
 
దీపావళిని జరుపుకునే పాటలు పండుగలకు ప్రత్యేకమైన మెరుపును జోడిస్తాయి. క్లాసిక్ బాలీవుడ్ హిట్‌లు దీపావళికి సరైన వాతావరణాన్ని సెట్ చేస్తాయి. ఇలా 'డీప్ దీపావళి కే ఝూతే': ఇది 1960 బాలీవుడ్ చిత్రం 'జుగ్ను' నుండి కలకాలం నిలిచిపోయే దీపావళి పాటగా నిలిచింది. ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇలా ఎన్నో దీపావళి పాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

31-10- 2024 గురువారం దినఫలితాలు - నిర్దిష్ట పథకాలతో ముందుకు సాగుతారు...