Publish Date: Fri, 23 Oct 2026 (15:41 IST)
Updated Date: Fri, 23 Oct 2026 (15:44 IST)
శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ప్రధానమైనవి. శరీరంలోని వ్యర్థాలను బైటకు పంపి ఆరోగ్యంగా వుంచేందుకు ఇవి దోహదపడతాయి. ఐతే మారుతున్న జీవనశైలి, మద్యం అలవాట్ల వల్ల కిడ్నీలు కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది. కిడ్నీల ఆరోగ్యానికి అవసరమైనన్ని మంచినీరు తాగమని చెబుతారు వైద్యులు. మంచినీటితో పాటు వీ
లున్నప్పుడల్లా సహజసిద్ధంగా తయారుచేసిన పానీయాలను సేవిస్తుండాలి. అవి ఏమిటో తెలుసుకుందాము.
అల్లం పుదీనా టీని తాగుతుంటే యూరినరీ ట్రాక్ ఆరోగ్యవంతంగా వుంటుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరచడంతో రక్తం సరఫరాకు ఎలాంటి అంతరాయం వుండదు.
గ్రీన్ టీ అనగానే సాధారణంగా కొవ్వును కరిగించుకోవటానికి వాడతారు అని తెలుసు. కాని గ్రీన్ టీ మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. గ్రీన్ టీకి శరీరంలోని క్రొవ్వు, రక్తపీడనాన్ని తగ్గించి కిడ్నీలకు మేలు చేస్తుంది.
త్రిఫల ఒక ఆయుర్వేద మిశ్రమం. ఇది మూత్రపిండాలను శుద్ధి చేసే టానిక్‌గా చెప్పబడింది. శరీరంలోని ఖనిజాల సమతుల్యతను కాపాడటంలో సహాయపడుతుందని పేరుపొందింది. దీనిలోని సున్నితమైన, శక్తివంతమైన నిర్విషీకరణ చర్య మూత్రపిండాల వడపోతను కొనసాగించడంలో, అనవసరమైన విషపదార్థాలు పేరుకుపోవడాన్ని పరిమితం చేయడంలో సహాయపడుతుంది.
ప్రతిరోజూ ఒక గ్లాసు సెలెరీ రసం తాగుతుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు. సెలెరీ రసం మూత్ర నాళాన్ని ఆరోగ్యంగా వుంచుంది. ఈ ప్రయోజనాలను పొందడానికి, కొన్ని సెలెరీ కాడలను నీటితో కలిపి మిక్సీలో వేసి, ఆ ద్రవాన్ని వడకట్టి, ఖాళీ కడుపుతో తాగండి.
డాండెలైన్ వేరు టీ శరీరం నుండి అదనపు ద్రవాలను, విషపదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడానికి సహాయపడుతుంది. డాండెలైన్ ఆకు సారం దాని వాపు నిరోధక గుణాల వల్ల మూత్రపిండ కణాలను రక్షిస్తుంది.