హృద్రోగులు క్రమంతప్పకుండా చేయాల్సిన పనులు...
ఇటీవలికాలంలో అనేక మంది హృద్రోగాలబారిన పడుతున్నారు. ఇలాంటివారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా, హృద్రోగ బాధితులు తరచూ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను విధిగా టెస్ట్ చేసుకోవాలి.
Publish Date: Wed, 22 Nov 2017 (13:07 IST)
Updated Date: Wed, 22 Nov 2017 (13:08 IST)
ఇటీవలికాలంలో అనేక మంది హృద్రోగాలబారిన పడుతున్నారు. ఇలాంటివారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా, హృద్రోగ బాధితులు తరచూ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను విధిగా టెస్ట్ చేసుకోవాలి. గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)పై ఓ కన్నేసి ఉంచాలని వైద్యులు చెపుతున్నారు.
గుండె పోటు, స్ట్రోక్ బారినపడిన రోగుల్లో కొవ్వు స్థాయిలను పరీక్షించుకోని వారిలో తదుపరి స్ట్రోక్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశోధకులు చెపుతున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న 66 ఏళ్ల సగటు వయసున్న 60,000 మందిపై ఈ అధ్యయనం నిర్వహించగా, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే మందులు తీసుకుంటున్న వారితో పోలిస్తే ఎల్‌డీఎల్‌ను అసలు పరీక్షించుకోని వారిలో గుండె సంబంధిత మరణాలు ఎక్కువగా నమోదైనట్టు తేలింది.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.....
Read More