Publish Date: Mon, 16 Dec 2019 (20:44 IST)
Updated Date: Wed, 18 Dec 2019 (19:22 IST)
చాలామంది తలపై దబాదబా నీళ్ళు పోసేసుకుని వచ్చేస్తుంటారు. కొంతమంది వేడినీళ్ళు అలాగే ఉంటే తలపై పోసేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా తలకు ఇష్టమొచ్చినట్లు షాంపులను వాడేస్తుంటారు. అయితే ఆవిధంగా చేయకూడదట.
వారానికి ఏ రెండు మూడుసార్లో తలస్నానం ఒక పద్ధతిగా చేయాలట. ముందుగా గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె లేదా ఆల్మండ్ ఆయిల్‌ను తలకు పట్టించాలట. ఆ తరువాత టర్కీ టవల్ తీసుకుని వేడినీటిలో ముంచి పిండేసి తలకు చుట్టుకోవాలట. దీని వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందట. కుదుళ్ళు కూడా దృఢంగా ఉంటాయట.
ఈ వేడినీటి ఆవిరి పద్ధతిని నెలకు ఒక్కసారి అయినా అనుసరిస్తుండాలట. తలస్నానం చేసిన తరువాత మరీ అవసరమైతే మినహా జుట్టును త్వరితంగా ఆరబెట్టుకునే పద్ధతులు అంటే డ్రయ్యర్‌ను వాడటం లాంటివి అనుసరించకూడదట.
అలాగే కొద్దిసేపు జుట్టుకు మెత్తని టవల్ చుట్టుకుంటే నీరంతా పీల్చేస్తుందట. తరువాత జుట్టు లూజ్‌గా వదిలేస్తే గాలికి సహజంగా ఆరిపోతుంది. జుట్టు మెరుపులీనుతూ ఉండాలన్న కోరికతో హెయిర్ స్ప్రేలు వంటివి వాడకూదట. ఇవి జుట్టును బాగా పొడిబార్చేస్తాయట.