Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాయంత్రం పూట 100 గ్రాముల డార్క్ చాక్లెట్‌ను తీసుకుంటే?

Advertiesment
Chocolate
, సోమవారం, 13 మే 2019 (15:17 IST)
బాదం గింజలతో చేసిన డార్క్ చాక్లెట్లతో ఆరోగ్యానికి మేలంటున్నారు.. న్యూట్రీషియన్లు. డార్క్‌ చాక్లెట్లలో సెట్రస్‌ హార్మోన్లను తగ్గించే గుణం పుష్కలంగా ఉంది. ఇది రక్తపోటును తగ్గించడంలో మందులతో సమానంగా పనిచేస్తుంది. బాదం పప్పులో గొప్ప శక్తినిచ్చే ప్రొటీన్‌ కూడా ఉంది. ఇది మోనో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌కు ఎంతో మంచి చేస్తుంది. అలాగే డిప్రెషన్‌ను తగ్గించే శక్తి కూడా ఈ డార్క్‌ చాక్లెట్‌కు ఉంది. 
 
డార్క్ చాక్లెట్ తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత రోగాలను దూరం చేస్తాయి సాయంత్రం పూట 100 గ్రాముల డార్క్ చాక్లెట్ బార్‌ను తీసుకుంటే.. కాపర్, మాంగనీస్, ఫైబర్, జింక్ సెలీనియమ్, పొటాషియం వంటివి శరీరానికి అందినట్లవుతాయని న్యూట్రీషియన్లు సలహా ఇస్తున్నారు. 
 
డార్క్ చాక్లెట్లను రోజూ తీసుకోవడం ద్వారా గుండెపోటును 37శాతం వరకు తగ్గించవచ్చునని తాజా పరిశోధనలో తేలింది. ఇందులోని కోకోవా ఎక్స్‌ట్రాక్స్, ఫ్లేవనాయిడ్స్ మెదడును చురుకుగా వుంటాయి. ఇంకా చెప్పాలంటే, చాక్లెట్లలోని అధిక ఫ్లేవనాయిడ్స్ చర్మంపై ఏర్పడే మంటను తగ్గిస్తుంది. కాబట్టి వేసవిలో తప్పకుండా డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. 
 
అలాగే ఒత్తిడి తగ్గాలంటే.. చాక్లెట్ మాత్రమే కాకుంజా ఆలివ్‌ నూనెతో గోబీ ఆకుల చిప్స్‌ తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. మనిషిని ఉల్లాసపరిచే సెరెటోనిన్‌ హార్మోన్లు పెరుగుతాయి. దీనికి తోడు కెరోటెనాయిడ్‌ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉత్పన్నమవుతాయి. మనిషిలో ఇవి ఆశావహ దృక్పథాన్ని బాగా పెంచుతాయి.
 
సోయాపాలతో చేసిన కాఫీ తాగితే, అందులో ఉండే ఫోలేట్‌ నిల్వల వల్ల మనసును ప్రశాంతపరిచే సెరటోనిన్‌ హార్మోన్లు పెరుగుతాయి. కాఫీతో కోకో పౌడర్‌ కలిపి తీసుకుంటే మనిషికి మేలు చేసే డొపామిన్‌ హార్మోన్లు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంబంధాలు చూస్తున్నారు... బేసిక్‌గా అబ్బాయిలంటే నాకు అసహ్యం... ఎలా?