Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు

Advertiesment
Acidity
కొంతమంది అజీర్ణ సమస్యతో సతమతమవుతుంటారు. తిన్నది జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. 
భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు. 
తులసి ఆకులను మూడు పూటలా భోజనానికి ముందు నమిలితే అసిడిటీ రాకుండా చూసుకోవచ్చు. 
భోజనం చేసిన తర్వాత 20 నిమిషాలు ఆగి కొబ్బరినీళ్లు తాగాలి. దీని వల్ల అసిడిటీ తగ్గుతుంది. 
భోజనానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే అసిడిటీ రాదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?