తామర గింజలు తీసుకుంటే లాభాలేమిటో తెలుసా?
తామర గింజలు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కాని పూల్ మఖని అంటే అందరు గుర్తుపడతారు. మఖని అంటే హిందీలో ఎండినవి అని అర్థం. వీటిని ఫాక్స్‌నట్స్ అని కూడా అంటారు. ఈ గింజలు తామర పువ్వుల నుండి వచ్చినవి. వీటి
Publish Date: Fri, 06 Jul 2018 (11:56 IST)
Updated Date: Fri, 06 Jul 2018 (14:30 IST)
తామర గింజలు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కాని పూల్ మఖని అంటే అందరు గుర్తుపడతారు. మఖని అంటే హిందీలో ఎండినవి అని అర్థం. వీటిని ఫాక్స్‌నట్స్ అని కూడా అంటారు. ఈ గింజలు తామర పువ్వుల నుండి వచ్చినవి. వీటిని పచ్చివిగా, వేయించుకుని ఉడకబెట్టి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చూచిస్తున్నారు.
ముదురు గోధుమ, తెలుపు రంగుల్లో ఉండే ఈ తామర గింజలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఉత్తర భారతదేశంలో వీటితో స్వీట్స్ కూడా తయారుచేసుకుంటారు. తామర గింజలు ఎండిన వాటికంటే పచ్చివాటిలోనే పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బులు, క్యాన్సర్ కారకమయ్యే ఫ్రీరాడికల్స్‌ను దరిచేరకుండా చేస్తాయి.
ఇందులో ఉండే పీచు పదార్థం బరువు తగ్గేందుకు చాలా దోహదపడుతుంది. వీటిల్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన దీనిని ఆహారంగా తీసుకుంటే బీపీని నివారించవచ్చును. గర్భిణుల, బాలింతలు వీటిని తీసుకుంటే నీరసం దరిచేదరు. రక్తహీనత గల రోగులకు ఇది ఒక మందుగా పనిచేస్తుంది. ఈ తామర గింజలు ఆకలిని పెంచుటకు సహాయపడుతాయి.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More