సోయాబీన్ ఆరోగ్య విషయాలు....
సోయాబీన్‌ను పూర్ణ ఆహారంగా ఆరోగ్య నిపుణులు గుర్తించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు సోయాబీన్ తీసుకుంటే మంచిది. జంతుమాంసం నుండి లభించే ప్రోటీన్లలో కొవ్వు అధికంగా ఉంటుంది. కాని సోయా నుండి లభించే ప్రో
Publish Date: Wed, 04 Jul 2018 (11:12 IST)
Updated Date: Wed, 04 Jul 2018 (11:50 IST)
సోయాబీన్‌ను పూర్ణ ఆహారంగా ఆరోగ్య నిపుణులు గుర్తించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు సోయాబీన్ తీసుకుంటే మంచిది. జంతుమాంసం నుండి లభించే ప్రోటీన్లలో కొవ్వు అధికంగా ఉంటుంది. కాని సోయా నుండి లభించే ప్రోటీన్లలో తక్కువస్థాయిలో కొవ్వు ఉండడం వలన రక్తనాళాలకు తద్వారా గుండెకు ఎంతో మేలుచేస్తుంది.
సోయా ఉత్పత్తులు శరీరంలో పెద్దప్రేగు ఆరోగ్యానికి దోహదపడుతుంది. ముఖ్యంగా ఈ పేగులో వచ్చే క్యాన్సర్‌ను నివారించడానికి సోయా చాలా ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుదలకు, అన్నవాహిక ఆరోగ్యానికి సోయాబీన్ చాలా సహాయపడుతుంది. సోయా ఉత్పత్తుల్లోని ఫైటోఈస్ర్టోజన్ క్యాల్షియాన్ని అధికం చేసి ఎముకలు దృఢంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
సోయా సంబంధ ఆహారపదార్థాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. మూత్రపిండ వ్యాధితో బాధపడేవారు సోయాబీన్ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఫలితం ఉంటుంది. కిడ్నీల్లో రాళ్లలాంటి సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More