Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినూత్నమైన ఐవిఎఫ్ సౌకర్యాలతో వరంగల్‌లో సంతానోత్పత్తి సంరక్షణను మార్చిన ఫెర్టీ9

Advertiesment
pregnant

ఐవీఆర్

, శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (17:57 IST)
ఫెర్టీ9 తమ వరంగల్ కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావటంతో సంతానోత్పత్తి సంరక్షణలో మహోన్నత యుగంలోకి అడుగు పెట్టండి. ఈ చారిత్రాత్మక పరివర్తన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, సమగ్ర సంతానోత్పత్తి పరిష్కారాలను అందించడంపై దృష్టి సారించిన అధునాతన సేవలను మిళితం చేస్తుంది. ఈ ప్రాంతంలో పునరుత్పత్తి వైద్య విధానాన్ని మార్చడంలో ఒక మైలురాయిగా ఇది నిలిచింది.
 
క్లినిక్ యొక్క అత్యాధునిక ఆవిష్కరణల జోడింపు, సంతానోత్పత్తి చికిత్సల యొక్క ఖచ్చితత్వం, విజయాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి. తాజా సాంకేతికతలలో RI విట్నెస్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సిస్టం వుంది, ఇది ప్రతి బీజకణంతో రోగి యొక్క గుర్తింపును సురక్షితంగా  అనుసంధానిస్తుంది, బీజకణం అసమతుల్యతను ప్రభావవంతంగా నివారిస్తుంది. అదనంగా, K-సిస్టమ్ ఇంక్యుబేటర్లు పిండం పెరుగుదలకు సరైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ పురోగతులు XILTRIX అలారం సిస్టమ్ ద్వారా సంపూర్ణం చేయబడతాయి. ఇది ల్యాబ్ వాతావరణంలో క్లిష్టమైన డిపెండెన్సీలను పర్యవేక్షిస్తుంది, నియంత్రిస్తుంది, సిస్టమ్‌ల సరైన పనితీరును నిర్ధారిస్తుంది. సంతానోత్పత్తి ప్రయాణంలో రోగుల మానసిక శ్రేయస్సు కోసం అవసరమైన సహాయాన్ని అందించడానికి అంకితమైన, అనుభవజ్ఞులైన కౌన్సెలర్ల బృందం ద్వారా ఈ పురోగతి యొక్క ఏకీకరణ మరింత బలోపేతం చేయబడింది.
 
"మా అత్యుత్తమ సంతానోత్పత్తి సంరక్షణకు ప్రాతినిధ్యం వహిస్తూ, వరంగల్‌లో కొత్తగా ప్రారంభించిన మా క్లినిక్‌ను అందుబాటులోకి తీసుకురావటం పట్ల మేము గర్విస్తున్నాము. సహాయక పునరుత్పత్తి చికిత్సల కోసం అధునాతన సాంకేతికతలపై గణనీయమైన పెట్టుబడి మా అంకితభావాన్ని నొక్కి చెబుతుంది" అని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి బుడి అన్నారు.
 
స్త్రీ-పురుష వంధ్యత్వానికి సంబంధించి సమగ్రమైన సేవలను ఫెర్టీ9 అందిస్తుంది. మా ప్రత్యేక చికిత్సలలో ఐయుఐ, ఐవిఎఫ్, ఐసిఎస్ఐ, బ్లాస్టోసిస్ట్ కల్చర్, పిక్సీ ( PICSI), ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ మరియు జెనెటిక్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. డిసెంబరులో, క్లినిక్ అసాధారణమైన రీతిలో 80% విజయాలను ఐవిఎఫ్ పరంగా సాధించింది, ఇది ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన సాంకేతికతల ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనూష కుశనపల్లి మాట్లాడుతూ, “గత నెలలో అసాధారణమైన విజయశాతం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మా బృందం యొక్క సమిష్టి కృషికి నేను చాలా సంతోషంగా వున్నాను. వరంగల్ కేంద్రంలోని మా రోగులకు కీలకమైన సహాయాన్ని అందించడంలో మా అచంచలమైన నిబద్ధతకు ఈ విజయశాతం నిదర్శనం" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చపాతీలు తినడం వల్ల ఏంటి లాభం?