Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

Advertiesment
Soft Tissue Robotic System

ఐవీఆర్

, బుధవారం, 17 సెప్టెంబరు 2025 (19:26 IST)
భారతీయ ఆరోగ్య సంరక్షణ, ప్రపంచ మెడ్‌టెక్‌కు ఒక మైలురాయి అయిన సందర్భములో, భారతదేశములోని ప్రముఖ వైద్య పరికరాల కంపెనీలలో ఒకటైన మెరిల్, నెక్ట్-జనరేషన్ సాఫ్ట్ టిష్యూ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ అయిన మిజ్జో ఎండో 4000ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ పురోగతి ఆవిష్కరణ సరైన శస్త్రచికిత్స అందుబాటును పునర్నిర్వచించటానికి సిద్ధముగా ఉన్నది, అలాగే భారతదేశపు ఈ అధునాతన రోబోటిక్ శస్త్రచికిత్స ప్రపంచమునకు కేంద్రముగా మారే అవకాశములను సూచిస్తున్నది.
 
శస్త్రచికిత్స భవిష్యత్తును తిరిగి ఊహించుకోవడం
మిజ్జో ఎండో 4000 అనేది జనరల్, గైనకాలజీ, యూరాలజీ, థొరాసిక్, కొలొరెక్టల్, బారియాట్రిక్, హెపాటోబిలియరీ, ENT, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, ఆంకాలజీ స్పెషాలిటీలలో అసాధారణమైన విస్తృతమైన విధానాలకు సహాయపడటానికి రూపొందించబడిన బహుముఖ, భవిష్యత్తుకు సిద్ధముగా ఉన్న మంచి ప్లాట్‌ఫామ్. మిజ్జో ఎండో 4000 ప్రధాన భాగములో AI- ఆధారిత 3D అనాటమికల్ మ్యాపింగ్, ఓపెన్ కన్సోల్ డిజైన్, 5G తో ప్రారంభించబడిన టెలిసర్జరీ సామర్థ్యాలు ఉన్నాయి. ఇవి అన్నీ కలిసి నిజంగా సరిహద్దులు లేని ఒక శస్త్రచికిత్సా పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు దోహదపడతాయి.
 
భారతదేశములో మొట్టమొదటిసారిగా, సర్జన్లు అల్ట్రా-ఫాస్ట్ కనెక్టివిటీ, అధునాతన రోబోటిక్స్, ఇమ్మర్సివ్ ఇమేజింగ్ ద్వారా సంక్లిష్టమైన విధానాలను రిమోట్‌గా, రియల్ టైమ్‌లో చేయగలుగుతారు. ఈ విధముగా ప్రపంచ స్థాయి నైపుణ్యములాతో అత్యంత వెనుకబడిన ప్రాంతములలో కూడా రోగులను చేరుకోగలిగి, సరిహద్దులు లేని ఆరోగ్య సంరక్షణ వాగ్దానాన్ని తప్పక నిలబెట్టుకోవడము జరుగుతుంది.
 
ఈ ప్రయోగమునకు ఉన్న ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ, మెరిల్ CEO శ్రీ వివేక్ షా ఇలా చెప్పారు. మిజ్జో ఎండో 4000 కేవలం ఒక సాంకేతిక పురోగతి కాదు. ఇది ఉద్దేశ్యపూర్తితమైన ప్రకటన. ఈ పద్దతి రోగులకు వేగవంతముగా కోలుకునే పరిస్థితులను కలిగించి మంచి ఫలితాలతో సురక్షితమైన, కనిష్ట ఇన్వాసివ్ విధానాలను అందించడానికి రూపొందించబడింది. రాబోయే కాలములో, ఈ ఆవిష్కరణ దేశవ్యాప్తముగా శస్త్రచికిత్స సంరక్షణను ఎంతో గొప్పగా మారుస్తుందని భారతదేశాన్ని మెడ్‌టెక్‌కు ప్రపంచానికి ఒక కేంద్రం బిందువుగా చేయగలదని మేము నమ్ముతున్నాము. భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తముగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు అధునాతన రోబోటిక్ సర్జరీని మరింత అందుబాటులోకి తెచ్చి, స్కేలబుల్ చేసి పరివర్తన చెందే విధముగా చేయడమే మా ముఖ్య ఉద్దేశ్యము.
 
గ్లోబల్-గ్రేడ్ టెక్నాలజీ, కీలక ఆవిష్కరణలలో ఇవి ఉంటాయి:
రియల్-టైమ్ మ్యాపింగ్, సర్జికల్ ప్లానింగ్‌కు AI-ఇంటిగ్రేటెడ్ 3D పునర్నిర్మాణ సాఫ్ట్‌వేర్.
అధునాతన ప్రీ-విజువలైజేషన్, ఖచ్చితమైన పోర్ట్ ప్లేస్‌మెంట్‌కు DICOM వ్యూయింగ్ టెక్నాలజీ.
5G-శక్తితో ఉన్న టెలిసర్జరీ, రిమోట్ ట్రైనింగ్ సరిహద్దు సహకార అమలునకు అవకాశమును కలిగిస్తుంది.
యూనివర్సల్ విజిట్ కార్ట్ అనేది శస్త్రచికిత్సా విధానాలన్నిటికీ అనుగుణముగా ఉంటుంది, దీని వలన ఆపరేషన్ గదిని సులభంగా అనుసంధానించవచ్చు.
సంక్లిష్టమైన మల్టీ-క్వాడ్రంట్ విధానాలకు సహాయపడటానికి ఆడియో-విజువల్ ఫీడ్‌బ్యాక్‌తో ఉన్న అధునాతన రోబోటిక్ ఆర్మ్స్.
 
మెడ్‌టెక్ పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న భారతదేశం
భారతదేశపు ఆరోగ్య సంరక్షణ స్వావలంబన, ఆవిష్కరణ నాయకత్వములో భారీగా పెట్టుబడులు అందుతున్న సమయములో మెరిల్ ప్రకటన వచ్చింది. ఈ ప్రారంభముతో, మెరిల్ లక్ష్యమైన మోర్ టు లైఫ్ మరింత బలోపేతం అవుతుంది - ఆరోగ్య సంరక్షణ మీద ఆసక్తి ఉన్నవారికే మాత్రమే కాకుండా, అవసరమైన వారందరికీ అందించడము.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్