Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంతానలేమి తాజా పురోగతులను అన్వేషించేందుకు నోవా ఐవిఎఫ్ ఫెర్టిలిటీ, హైదరాబాద్ సంతానోత్పత్తి సదస్సు

Advertiesment
నోవా కాన్ఫరెన్స్
, సోమవారం, 18 డిశెంబరు 2023 (15:49 IST)
భారతదేశంలోని అతిపెద్ద ఫెర్టిలిటీ చైన్ హాస్పిటల్స్‌లో ఒకటైన నోవా ఐవిఎఫ్ ఫెర్టిలిటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కూకట్‌పల్లి సహకారంతో,  సహాయక పునరుత్పత్తి సాంకేతికతలలో పురోగతితో పాటుగా పురుషులు- స్త్రీలలో సంతానోత్పత్తి గురించి చర్చించడానికి నిరంతర వైద్య విద్యా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సంతానోత్పత్తికి సంబంధించి విటమిన్ డి  మరియు సంతానోత్పత్తిలో దాని పాత్ర, ఐవిఎఫ్ ల్యాబ్‌లోని సాంకేతికత, థైరాయిడ్ సమస్యలు, పీసీఓఎస్ వంటి ఎండోక్రైన్ సమస్యలు మరియు సంతానోత్పత్తితో దాని సంబంధం వంటి  వివిధ సమస్యల గురించి చర్చించారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 17, 2023న హైదరాబాద్‌లోని హోటల్ సితార గ్రాండ్‌లో జరిగింది.
 
సంతానలేమికి సంబంధించి ప్రబలంగా ఉన్న దురభిప్రాయం, తరచుగా పునరుత్పత్తి సవాళ్లకు స్త్రీలు మాత్రమే బాధ్యత వహిస్తారనే నమ్మకం చుట్టూ తిరుగుతుంది. వాస్తవానికి, సంతానోత్పత్తి సమస్యలు స్త్రీ-పురుష కారకాల నుండి ఉత్పన్నమవుతాయని గుర్తించడం చాలా అవసరం. హైదరాబాద్‌లోని నోవా ఐవిఎఫ్ ఫెర్టిలిటీ నిపుణులు స్త్రీ మరియు పురుష సంతానలేమిలో పెరుగుదలను గుర్తించారు.
 
ఈ కార్యక్రమంలో పురుషుల సంతానలేమికి సంబంధించిన అంశాలపై హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వున్న నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ సరోజ కొప్పాల మాట్లాడుతూ, “మెటా-విశ్లేషణ ప్రకారం, 1973 మరియు 2011 మధ్య స్పెర్మ్ కౌంట్ గణనీయంగా 50% తగ్గింది. సంతానలేమి, సకాలంలో సహాయం కోరకుండా జంటలను తరచుగా నిరుత్సాహపరుస్తుంది. హైదరాబాద్‌లో, ముఖ్యంగా పురుషులలో సంతానలేమి సమస్య గణనీయంగా పెరిగింది. మధుమేహం, వృషణ క్యాన్సర్, జన్యుపరమైన సమస్యలు వంటివి పురుషులలో కొన్ని అంతర్లీన వైద్య పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. అందువల్ల కేవలం సాదారణ వీర్య విశ్లేషణ సంతానలేమి సమస్యలకు మూల కారణాన్ని నిర్ధారించదు. రోగి యొక్క వివరణాత్మక వైద్య చరిత్రను పొందడం, వాటిని క్షుణ్ణంగా అంచనా వేయడం అత్యవసరం. పురుషులలో సమస్యను కనుగొనడంలో జాప్యం వారి చికిత్సపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, ఉదాహరణకు వృషణాలు మరియు పిట్యూటరీ కణితులు రెండూ వేగంగా పెరుగుతున్నాయి, కానీ సమర్థవంతంగా నయం చేయగలము" అని అన్నారు. 
 
డాక్టర్ బాను తేజ రెడ్డి, కన్సల్టెంట్ - యూరాలజిస్ట్ మరియు మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ & మేల్ ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ మాట్లాడుతూ, “మేము పురుషుల సంతానలేమి కేసుల పరంగా సుమారు 30% పెరుగుదలను గమనించాము. నిశ్చల జీవనశైలి, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, అంగస్తంభన వంటి లైంగిక పరిస్థితులు వంటివి పురుషులలో సంతానలేమికి కారణమవుతాయి. అదనంగా హార్మోన్ల అసమతుల్యత, వెరికోసెల్, తక్కువ స్పెర్మ్ కౌంట్, జన్యు పరమైన కారకాలు, ఊబకాయం మరియు ధూమపానం, పొగాకు నమలడం లేదా మద్యపానం వంటి వ్యసనాలు ఈ పెరుగుదలకు మరింత దోహదం చేస్తాయి. వివరించలేని సంతానలేమి సమస్య పెరుగుతోంది. ప్రస్తుతం, 30-50% సంతానలేమి కేసులకు మాత్రమే పూర్తిగా చికిత్స చేయవచ్చు. తక్కువ స్పెర్మ్ కౌంట్, వీర్య కణాల అసాధారణ ఆకారం మరియు వీర్య కణాల కదలికకు సంబంధించిన సమస్యలతో 35-45 సంవత్సరాల వయస్సు గలవారు ముఖ్యంగా ప్రభావితమవుతున్నారు. ఈ జంటలు తమ భయాలను అధిగమించడానికి, అవసరమైన వైద్య మార్గనిర్దేశాన్ని పొందేందుకు తగిన రీతిలో శక్తివంతం చేయడానికి కరుణ, విద్య మరియు బహిరంగ సంభాషణలకు అనువైన వాతావరణాన్ని నెలకొల్పడం చాలా ముఖ్యమైనది" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్తి పండ్లతో కలిపి సోంపు గింజలు తింటే ఏమవుతుంది?