Publish Date: Mon, 15 Apr 2019 (21:24 IST)
Updated Date: Mon, 15 Apr 2019 (21:25 IST)
మారిన ఆహారపు అలవాట్లతో.. ప్రస్తుతం చాలామంది ఉదర సంబంధ సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రధానంగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే స్పందిస్తే.. గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందుకోసం ఇంటి నుంచే చిన్నచిన్న చిట్కాలతో గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.
గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు..
1. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు.
2. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది.
3. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
4. ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకున్నా గ్యాస్ సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు.
5. టేబుల్ స్పూను జీలకర్ర పొడిని ఏదో ఒక ఆహారంలో చేర్చుకుని తీసుకుంటే అనుకోకుండా ఎదురయ్యే గ్యాస్ సమస్య నెమ్మదిస్తుంది.