ప్రతిరోజూ జామపండు తీసుకుంటే.. మధుమేహా వ్యాధి..?
వర్షాకాలంలో ఆరోగ్యాన్ని పెంచేందుకు జామపండు మంచిగా ఉపయోగపడుతుంది. జామపండులో విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. జామపండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం చెడు కొలెస్ట్రాల
Publish Date: Sat, 22 Sep 2018 (11:04 IST)
Updated Date: Sat, 22 Sep 2018 (11:34 IST)
వర్షాకాలంలో ఆరోగ్యాన్ని పెంచేందుకు జామపండు మంచిగా ఉపయోగపడుతుంది. జామపండులో విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. జామపండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం చెడు కొలెస్ట్రాల్, హైబీపీ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. అధిక బరువును తగ్గించుటకు ఎంతో దోహదపడుతుంది.
జామపండులోని కార్బోహైడ్రేట్స్ జీర్ణశక్తిని పెంచుటకు సహాయపడుతాయి. ప్రతిరోజూ ఒక జామపండును తీసుకుంటే డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు దరిచేరవు. అల్జిమర్స్ వ్యాధిని నివారిస్తుంది. కంటి శుక్లాలు, కీళ్లవాపులు వంటి సమస్యలను తొలగిస్తుంది. ఈ పండులోని విటమిన్ ఏ, సీ శరీరో రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
జామపండు రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గించుస్తుంది. దంతాలు, గొంతు నొప్పి, చిగుళ్ల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. నోటి దుర్వాసను తొలగించుటకు చక్కగా పనిచేస్తుంది. జామపండు జ్యూస్ కాలేయానికి టానిక్‌లా ఉపయోగపడుతుంది. ఎముకల బలానికి మంచిది. గర్భిణులు జామపండు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More