విటమిన్స్ ఎవరికి అవసరం?
చిన్న పిల్లల నుంచి వయసు పైబడిన వారందరికి విటమిన్లు అవసరమే. అయితే ఏ వయస్సులో ఏ విటమిన్లు అవసరమనే విషయంపై అవగాహన పెంచుకోవాలంటున్నారు వైద్యులు. చిన్న పిల్లలకు అంటే శిశువు నుంచి ఆరేళ్ల వయస్సు ఉన్న పిల్లలక
Publish Date: Thu, 10 May 2018 (11:25 IST)
Updated Date: Thu, 10 May 2018 (11:30 IST)
చిన్న పిల్లల నుంచి వయసు పైబడిన వారందరికి విటమిన్లు అవసరమే. అయితే ఏ వయస్సులో ఏ విటమిన్లు అవసరమనే విషయంపై అవగాహన పెంచుకోవాలంటున్నారు వైద్యులు. చిన్న పిల్లలకు అంటే శిశువు నుంచి ఆరేళ్ల వయస్సు ఉన్న పిల్లలకు విటమిన్-ఎ, విటమిన్-సి చాలా అవసరం. ఈ దశలో వారికి సరైన మోతాదులో విటమిన్లు లభించకపోతే కంటి చూపు తగ్గిపోవడం, రికెట్స్, స్కర్వీ అనే సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
పెద్దవారిలో విటమిన్స్ తగ్గినపుడు అథెరోస్కెలెరోసిస్ అంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుందంటున్నారు. క్యాన్సర్ వంటి వ్యాధులు, ఇమ్యూనిటీ తగ్గడంవల్ల ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎముకలు బలహీనంగా అయి ఆస్టియోపోరోసిస్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువేనంటున్నారు. ఆస్టియోపోరోసిన్ వస్తే ఎముకలు సులువుగా విరిగిపోతాయి.
గర్భిణులకు ఫోలిక్‌యాసిడ్ అనే విటమిన్ మాత్రలు అవసరమవుతాయి. ఈ విటమిన్ లోపిస్తే పుట్టబోయే శిశువుల్లో అనేక సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని చెపుతున్నారు. ఇక శాఖాహారుల్లో విటమిన్-బి12 లోపం ఉంటుంది. దీనివల్ల రక్తం తక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు మాత్రల రూపంలో ఆ లోటును భర్తీ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అయితే విటమిన్ మాత్రలను వైద్యుల సలహామేరకు వాడటమే ఉత్తమం అని సూచిస్తున్నారు.
About Writer
kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More