ప్రతిరోజూ బెల్లం తీసుకుంటే? ఆస్తమా వ్యాధికి?
బెల్లం రోగనిరోధకశక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. పాలలో బెల్లం తరుగును వేసి తాగితే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. జీవక్రియ సరిగ్గా జరిగేట్టుగా ఉపయోగపడుతుంది. పొటాషియం శరీరంలోన
Publish Date: Tue, 10 Jul 2018 (09:56 IST)
Updated Date: Tue, 10 Jul 2018 (11:48 IST)
బెల్లం రోగనిరోధకశక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. పాలలో బెల్లం తరుగును వేసి తాగితే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. జీవక్రియ సరిగ్గా జరిగేట్టుగా ఉపయోగపడుతుంది. పొటాషియం శరీరంలోని ఎలక్ట్రొలైట్స్‌ను సమతుల్యం చేస్తుంది. కండరాలను పెంచడమేకాకుండా పటిష్టం చేస్తుంది.
శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా రక్తంలోని హిమోగ్లోబిన్ ప్రమాణాన్ని పెంచుతుంది. ఐరన్, ఫొటేట్‌లు బెల్లంలో ఎక్కువగా ఉండడం వలన రక్తహీనత తగ్గుతుంది. ఎర్రరక్త కణాలు కూడా సాధారణ ప్రమాణంలో కొనసాగుతాయి. బెల్లం ప్రతిరోజూ తీసుకోవడం వలన శరీరంలోని ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంచే విటమిన్స్, మినరల్స్ ఇందులో ఎక్కువగా ఉన్నాయి.
జలుబు, దగ్గు, తలనొప్పులకు బెల్లం బాగా పనిచేస్తుంది. గొంతుమంటని తగ్గిస్తుంది. బెల్లంలో క్యాలరీలు కూడా అధికంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ ప్రమాణాల్లో తేడాలు తలెత్తుతాయి. రక్తపోటు, గుండెజబ్బులు వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శ్వాసకోశ సంబంధమైన ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులకు తగ్గిస్తుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More