ఆకలిని పెంచే పండ్లు - రసాలు ఏవి?
చాలామందికి ఆకలి సరిగా వేయదు. జీర్ణక్రియ లోపం కారణంగా ఈ పరిస్థితి ఉంటుంది. విస్తర్లో పంచభక్ష్యపరమాన్నాలు ఉన్నప్పటికీ వాటిని ఆరగించేందుకు ఏమాత్రం మనసురాదు. అలాంటి వారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే కడుపున
Publish Date: Tue, 11 Sep 2018 (16:07 IST)
Updated Date: Tue, 11 Sep 2018 (16:15 IST)
చాలామందికి ఆకలి సరిగా వేయదు. జీర్ణక్రియ లోపం కారణంగా ఈ పరిస్థితి ఉంటుంది. విస్తర్లో పంచభక్ష్యపరమాన్నాలు ఉన్నప్పటికీ వాటిని ఆరగించేందుకు ఏమాత్రం మనసురాదు. అలాంటి వారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే కడుపునిండా లాగించవచ్చు. ఆ చిట్కాలేంటో పరిశీలిద్ధాం.
అల్లం : వికారం, అజీర్తికి అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ 4-5 అల్లం ముక్కలను దవడన పెట్టుకుని నమిలి, ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. దీనివల్ల క్రమంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఆకలి కూడా బేషుగ్గా అవుతుంది.
నిమ్మరసం : జీర్ణక్రియను వేగవంతం చేయడంలో నిమ్మరసం భలేగా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలిగించి ఆకలి పుట్టేలా చేస్తుంది. ఆకలి మందగించినపుడు గ్లాసు నీళ్లలో కాస్త నిమ్మరసం పిండి, అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకోండి. ఆకలి భేషుగ్గా ఉంటుంది.
ఖర్జూరాలు : పోషక విలువులు మెండుగా ఉన్నా ఖర్జూరాలకు ఆకలి పుట్టించే గుణం కూడా ఎక్కువే. దీన్ని రసంలా చేసి కూడా తీసుకోవచ్చు. ప్రతి రోజూ నాలుగైదు ఖర్జూరాలు తింటే ఆకలిలేమి తీరిపోతుంది.
మెంతులు : పొట్టలో గ్యాస్‌ను బయటకు తోసేయడంలో మెంతులు బాగా పని చేస్తాయి. దీంతో ఆకలి పెరుగుతుంది. ప్రతి రోజూ మెంతిపొడిని తేనెతో కలిపి తగిన మోతాదులో తీసుకుంటే ఆకలి పుడుతుంది.
ద్రాక్ష : ద్రాక్షలో విటమిన్-సి ఉంటుంది. అది జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది. భోజనం చేశాక కొన్ని ద్రాక్షపళ్లు తినండి. తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమైపోతుంది. ఆకలి కూడా పెరుగుతుంది.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.....
Read More