Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలక చెందిన మొసలి.. మాంసం ముక్క ఇవ్వలేదని.. వీడియో వైరల్

Advertiesment
Alligator
పిల్లలు బొమ్మలు కావాలని అలగి ఏడుస్తుండటం చూసేవుంటాం. కొందరు పిల్లలైతే బొమ్మలు కొనిపెట్టేంత వరకు వదిలిపెట్టరు. ఇక్కడ విషయం ఏమిటంటే.. జంతువులు కూడా అలుగుతాయని తెలిసింది. అటువంటి వాటిల్లో ఈ మొసలి కూడా ఒకటి. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఎవర్ గ్రేడ్స్ హాలిడా పార్క్‌లో ఓ మొసలి ఉంది. ఆ మొసలికి ఇద్దరు కేర్ టెకర్లు ఉన్నారు. 
 
ఓ రోజు కేర్ టేకర్ జంట మొసలికి మాంసం అందించేందుకు కొలను వద్దకు వెళ్లారు. మాంసం ముక్కను అందుకో అంటూ దానిని ఆడించారు. కానీ, అది అందుకోలేకపోయింది. మాంసం ముక్క కింద పడింది. నువ్వు ఓడిపోయావని గేలి చేయడంతో ఆ మొసలికి కోపం వచ్చేసింది. 
 
అంతటితో ఆగకుండా కింద పడిన మాంసం ముక్కను తినకుండా నీళ్ళలోకి వెళ్ళిపోయింది. తర్వాత కేర్ టేకర్ మాంసం ముక్కను చూపిస్తూ తినమని బతిమిలాడటంతో ఆ ముక్కను తీసుకొని నీళ్ళల్లోకి వెళ్ళింది. దీనికి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లి ఆవును కొట్టిన వ్యక్తిని దూడ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసిందంటే?