Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయుల్లో మరో గుబులు... భార్యల వర్క్ పర్మిట్‌పై ఆందోళన.. ట్రంప్ ఏం చేస్తారోనన్న ఉత్కంఠ?

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దేశాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. వీరిలో ఎక్కువగా భారతీయులే ఉన్నారు. ఇప్పటికే హెచ్ 1బి వీసాలపై భారతీయుల్లో ఆందోళన నెలకొనివుంది.

Advertiesment
Trump's new executive order
, బుధవారం, 8 మార్చి 2017 (20:14 IST)
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దేశాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. వీరిలో ఎక్కువగా భారతీయులే ఉన్నారు. ఇప్పటికే హెచ్ 1బి వీసాలపై భారతీయుల్లో ఆందోళన నెలకొనివుంది. ఈ నేపథ్యంలో... హెచ్‌-1బీ వీసాలపై అమెరికాకు వెళ్లిన వారి జీవితభాగస్వాములకు వర్క్‌ పర్మిట్‌పై ఇపుడు గుబులు మొదలైంది. 
 
మాజీ అధ్యక్షుడు ఒబామా అధికారంలో ఉన్నప్పుడు హెచ్‌-1బీ వీసాలున్న వారి జీవితభాగస్వాములకు పనిచేసే అవకాశం కల్పించారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు అమెరికన్‌ సంస్థలు వాషింగ్టన్‌ డీసీలోని ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించాయి. ఈ కేసు విచారణ నేపథ్యంలో కోర్టు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగాన్ని స్పందించాల్సిందిగా అడిగింది. అయితే ఈ విషయంపై స్పందించడానికి 60 రోజుల సమయం కావాలని ట్రంప్‌ యంత్రాంగం కోరింది. దీనిపై ట్రంప్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని హెచ్‌-1బీ వీసాలపై వెళ్లిన భారతీయుల్లో ఉత్కంఠ నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ బిల్లుకు మోక్షం కలిగిన నాడే మహిళలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు : పవన్ కళ్యాణ్