Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నువ్వు పాలిచ్చే తల్లివేనా.. జాకెట్ విప్పు... చనుబాలు పితికి చూపించు'.. భారత సంతతి మహిళకు అవమానం

బెర్లిన్ విమానాశ్రయంలో ఓ భారతీయ మహిళకు ఘోర అవమానం జరిగింది. ‘‘నువ్వు పాలిచ్చే తల్లివేనా? అయితే.. నీ బిడ్డ లేకుండా ఎందుకు ప్రయాణిస్తున్నావ్‌. నీ మీద మాకు అనుమానాలున్నాయ్‌. ఓసారి జాకెట్‌ విప్పు.. చనుబాల

Advertiesment
Indian-origin woman
, బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (10:36 IST)
బెర్లిన్ విమానాశ్రయంలో ఓ భారతీయ మహిళకు ఘోర అవమానం జరిగింది. ‘‘నువ్వు పాలిచ్చే తల్లివేనా? అయితే.. నీ బిడ్డ లేకుండా ఎందుకు ప్రయాణిస్తున్నావ్‌. నీ మీద మాకు అనుమానాలున్నాయ్‌. ఓసారి జాకెట్‌ విప్పు.. చనుబాలు పితికి చూపించు’’ ఇదీ... భారత సంతతికి చెందిన ఓ సింగపూర్‌ మహిళ పట్ల పోలీసు ప్రవర్తించిన అమానవీయమైన తీరు. ఈ చర్యతో ఆమె హతాశురాలైంది. దీంతో సదరు పోలీసుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. 
 
గాయత్రీ బోస్‌ అనే మహిళ సింగపూర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు మూడేళ్ల బాబు, ఏడునెలల పాప ఉన్నారు. గత గురువారం ఆమె పారిస్‌ వెళ్లేందుకు బెర్లిన్‌లోని ఫ్రాంక్‌ఫర్డ్‌ విమానాశ్రయానికి వచ్చారు. ఆమె లగేజీని ఎక్స్‌రే మిషన్‌ ద్వారా అధికారులు చెక్‌ చేయగా అందులో బ్రెస్ట్‌ పంప్‌ (చిన్నారుల కోసం పాలు పితికే పరికరం) కనిపించింది. వెంటనే గాయత్రి పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆపై ఓ మహిళా పోలీసు అధికారి ఆమెను పక్క గదిలోకి తీసుకెళ్లి 45 నిమిషాలపాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. లోపల తాను అనుభవించిన వ్యథనంతా చెప్పుకొని గాయత్రి కన్నీటి పర్యంతమైంది. ‘‘గదిలోకి తీసుకెళ్లిన మహిళా పోలీసు.. జాకెట్‌ విప్పి పాలిండ్లను చూపెట్టు అంటూ గద్దించింది. తర్వాత పాలు వస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు రొమ్ములను ప్రెస్‌ చేయమంది. నాకు అలా చేయక తప్పలేదు. గది బయటకు వచ్చిన తర్వాతగానీ నా విషయంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. జరిగింది తలచుకొని ఏడుపు ఆగలేదు’’ అని ఆమె వాపోయింది. కొద్దిసేపటికి బ్రెస్ట్‌ పంప్‌ను పరీక్షించి, పారిస్‌ వెళ్లేందుకు అనుమతిస్తూ పాస్‌పోర్టును తిరిగి ఇచ్చేశారని ఆమె పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలో ఎంట్రన్స్ ఫీజు తగ్గుతుందని.. ఫెన్సింగ్ ఎక్కి దూకాడు.. పులి చంపేసింది..