Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Advertiesment
earthquake

ఠాగూర్

, గురువారం, 27 నవంబరు 2025 (12:21 IST)
ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం ఆషే ప్రావిన్స్‌కు సమీపంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున నమోదైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ భూప్రకంపనల ప్రభావం కారణంగా ఇప్పటికే కొండచరియలు, ఆకస్మిక వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆ దేశాన్ని ఈ ప్రకృతి విపత్తు వణికించింది. 
 
సైక్లోన్ సెన్యార్‌ కారణంగా సుమిత్రా దీవుల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. దాంతో ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజల ఆచూకీ లభ్యమైంది. ఈ వరదల వల్ల బ్రిడ్జ్‌ కూలిపోవడంతో పాటు రోడ్లు దెబ్బతిన్నాయి. దాంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వెల్లడించారు. 
 
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌కు సమీపంలో ఉండే ఇండోనేసియా తరచూ భూకంపాలు, సునామీ వంటి విపత్తులను ఎదుర్కొంటోంది. ఈ రింగ్‌ అనేది పసిఫిక్‌ మహాసముద్ర తీరం వెంట విస్తరించి ఉన్న భారీ టెక్టోనిక్‌ బెల్ట్‌. ఇక్కడే 90 శాతం భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, అలస్కాలోని అల్యూటియన్‌ ద్వీపాలు దీని పరిధిలోకి వస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం