Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మసూద్ అజర్‌కు కిడ్నీ వైఫల్యం.. పాక్ సైనిక ఆస్పత్రిలో డయాలిసిస్

Advertiesment
Masood Azhar
, ఆదివారం, 3 మార్చి 2019 (13:38 IST)
పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్న జైషే మహమ్మద్ (జేఈఎం) వ్యవస్థాపకుడు మసూద్ అజర్ మూత్రపిండాల పనితీరు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆయనను రావల్పిండిలోని సైనిక ఆస్పత్రికి తరలించి నిత్యం డయాలిసిస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. 
 
ప్రస్తుతం మసూద్ అజర్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని, అయితే ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందున ఆయన ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నాడని పాక్ విదేశాంగ మంత్రి గురువారం ప్రకటించిన విషయం విదితమే. మసూద్ అజర్ మూత్రపిండాల వైఫల్యంతో ఇబ్బంది పడుతున్నాడని, ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని సైనిక దవాఖానలో చికిత్స పొందుతూ తరచుగా డయాలిసిస్ చేయించుకుంటున్నాడని ఇటీవల అందిన వార్తలు స్పష్టం చేస్తున్నాయి అని భద్రతాదళానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 
 
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడైన మసూద్ అజర్ కాశ్మీరులో జిహాద్‌ను ప్రచారం చేస్తూ 1994లో భారత్‌కు పట్టుబడ్డాడు. అయితే 1999 డిసెంబర్ 31న కాందహార్‌కు హైజాక్ అయిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించుకునేందుకు భారత ప్రభుత్వం మసూద్ అజర్‌ను విడుదల చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన రాక్షస కొడుకు