Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉండలేకపోతున్నాం.. నరకం అనుభవిస్తున్నాం: ప్రజలు

పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయిమిస్తోందని.. అందుకే పాకిస్థాన్ ఆక్రమిత ఉగ్రవాదులపై భారత ఆర్మీ సైనికులు ఉక్కుపాదం మోపింది. కానీ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టిన భారత్‌పై పాక్ విమర్శలు గుప్పించింది

Advertiesment
Hell
, గురువారం, 6 అక్టోబరు 2016 (17:13 IST)
పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయిమిస్తోందని.. అందుకే పాకిస్థాన్ ఆక్రమిత ఉగ్రవాదులపై భారత ఆర్మీ సైనికులు ఉక్కుపాదం మోపింది. కానీ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టిన భారత్‌పై పాక్ విమర్శలు గుప్పించింది. సర్జికల్ స్ట్రైక్స్ బూటకమని చెప్తున్న పాకిస్థాన్‌కు ఇప్పటికే ఆ దాడులు జరిగిన మాట వాస్తవమేనని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఆర్మీ ప్రకటించింది. తీవ్రవాదుల మృతదేహాలను ఖననం చేసి ఆపై.. సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదంటున్న పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. 
 
టెర్రరిస్టుల శిబిరాల కారణంగా పాక్‌ ఆక్రమిత కశ్మీరులో నివసించాలంటే నరకంలో ఉన్నట్లుందంటూ అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా టెర్రర్ మూకలను, వారి శిక్షణా కార్యక్రమాలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజులు గడపాల్సి వస్తోందని, తమ నిత్య జీవనం నరకమైందన్నారు. ముజఫరాబాద్‌, కొట్లీ, గిల్గిట్‌, దయీమిర్‌, నీలమ్‌, మీర్పూర్‌ వంటి ప్రాంతాల నుంచి ప్రజలంతా అధిక సంఖ్యలోఈ నిరసనల్లో పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌లా తండ్రికి తలవంపులు తెచ్చే పని చేయను: నారా లోకేష్