Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్.. 114 మైళ్లను అందుకుంటానని ప్రమాదానికి గురయ్యాడు.. చావుబతుకుల మధ్య?

మొన్నటికి మొన్న అమెరికా యువతి కారులో తన ప్రేమికుడితో వీడియో కాల్ మాట్లాడుతూ, పోలీసు కారును ఢీకొన్న నేపథ్యంలో.. తాజాగా ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ ఓ యువకుడు ప్రమాదానికి గురైయ్యాడు. యువత అత్యుత్

Advertiesment
Man crashes while streaming 114 mph drive on Facebook Live
, శుక్రవారం, 2 డిశెంబరు 2016 (17:45 IST)
మొన్నటికి మొన్న అమెరికా యువతి కారులో తన ప్రేమికుడితో వీడియో కాల్ మాట్లాడుతూ, పోలీసు కారును ఢీకొన్న నేపథ్యంలో.. తాజాగా ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ ఓ యువకుడు ప్రమాదానికి గురైయ్యాడు. యువత అత్యుత్సాహం, సోషల్ మీడియా ప్రభావంతో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. 20 సంవత్సరాల ఓనాసీ ఓలియో రోజాస్ అనే యువకుడు, తన కారుతో యూఎస్ రూట్ 6పైకి వెళ్లాడు. వేగంగా కారును నడుపుతూ ఫేస్ బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ.. అందరికంటే వ్యత్యాసంగా ఉండాలనుకున్న ఆ యువకుడు ప్రమాదానికి గురవక తప్పలేదని రోడ్ ఐలాండ్ పోలీసులు వెల్లడించాడు. అంతకుముందే ఫేస్‌బుక్‌ పేజీలో గంటకు 114 మైళ్లను అందుకుంటానని ముందే సవాలు చేశాడు. 
 
ఈ క్రమంలో అతివేగంతో కారును నడిపే విధానాన్ని లైవ్ చూపించడం ప్రారంభించాడు. కానీ అతివేగం కారణంగా కారు అదుపుతప్పింది. ఇంకా రోడ్డు రక్షణగా వేసిన కాంక్రీట్ అడ్డుగోడను ఢీకొని, ఆపై చెత్త తరలించే వాహనాన్ని ఢీకొంది. ప్రమాదానికి ముందు కారు మూడు లైన్లను దాటిందని, నిమిషాల్లోనే రెస్క్యూ టీమ్ ఘటనా స్థలికి చేరుకుని రోజాస్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో 2 గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌లో అభ్యంతరకర ఫోటో ప్లస్ మెసేజ్.. సస్పెండ్ అయిన విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్