బంగ్లాదేశ్‌లోని పాకిస్థాన్ దౌత్యవేత్త ఒకరు హనీట్రాప్ కేసులో చిక్కుకున్నారు. ఆయన అమ్మాయితో రాసలీలలు గడుపుతున్న వీడియో ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో అప్రమత్తమైన పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఆయనను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఆ దౌత్యవేత్త పేరు అహ్మద్ మరూఫ్ కాగా, ఆయన మే 11వ తేదీనే ఢాకా విడిచివెళ్లినట్టు సమాచారం. దుబాయ్ మీదుగా ఆయన ఇస్లామాబాద్‌కు చేరుకున్నట్టు సమాచారం. మరూఫ్ సెలవు గురించి పాకిస్థాన్ హైకమిషన్.. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. అయితే, ఎదుకు వెళ్లారు.. ఎన్ని రోజులు సెలవులో ఉన్నారన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది.
మరోవైపు పాకిస్థాన్ విదేశాంగ శాఖ కూడా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరూఫ్ స్థానంలో పాక్ డిప్యూటీ హైకమిషనర్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్ బాధ్యతలు చేపట్టారు.