Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుతిన్ పిలుపు: రష్యా-అమెరికాల మధ్య మూడో ప్రపంచ యుద్ధం.. అదే జరిగితే ప్రపంచం ఏమౌతుంది?

ఒకవైపు భారత్-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉగ్రవాదం, కాశ్మీర్ వివాదం ముదురుతుంటే.. అతి త్వరలోనే మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా అనే అనుమానాలు ప్రజల మధ్య పెరిగిపోతున్నాయి. అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తతలు తలె

Advertiesment
Putin
, శుక్రవారం, 14 అక్టోబరు 2016 (17:15 IST)
ఒకవైపు భారత్-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉగ్రవాదం, కాశ్మీర్ వివాదం ముదురుతుంటే.. అతి త్వరలోనే మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా అనే అనుమానాలు ప్రజల మధ్య పెరిగిపోతున్నాయి. అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తితే.. ప్రత్యక్షంగా మూడో ప్రపంచ యుద్ధమని ప్రకటించకపోయినా, కొన్ని సంధర్బాల్లో దేశాధ్యక్షుల ప్రకటనలు, వారి ప్రవర్తనలను బట్టి చూస్తుంటే అది నిజమేమోనని అనిపించక తప్పదు. ఈ అనుమానాలకు రష్యా దేశాధ్యక్షుడు ఇచ్చిన పిలుపు తావిచ్చింది. 
 
ప్రపంచ దేశాల్లో ఎక్కడపడితే అక్కడ ఉన్న రష్యా అధికారులు, రాజకీయ నేతలు అందరూ తిరిగి రష్యాకు వచ్చేయాలని ఆ దేశాధ్యక్షుడు "వ్లాదిమిర్ పుతిన్" పిలుపునివ్వడం ప్రచ్ఛన్న యుద్ధాలకు దారితీసే ఛాన్సున్నట్లు తెలియజేస్తుంది. 
 
సిరియా గురించి జరుగుతున్న చర్చల నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించుకున్నప్పటి నుంచి అమెరికా - రష్యా సంబంధాలు చెడిపోవడం మొదలైంది. దానికి తోడు డెమొక్రాటిక్ నేషనల్ కమిటీలో కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురి కావడం, దాని వెనుక రష్యా ప్రభుత్వం ఉందని చెప్పడంతో పరస్పర ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. 
 
ఈ పరిస్థితులు క్రమంగా యుద్ధం దారికే పయనిస్తాయా? అనేది విశ్లేషకుల అనుమానం. యుద్ధమే అదీ యూఎస్ - రష్యా మధ్య ప్రత్యక్ష పోరు సంభవిస్తే ప్రపంచం రెండు కూటములుగా విడిపోక తప్పదని.. తద్వారా ప్రపంచానికి దుర్దినాలు సంభవించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
సిరియా సంక్షోభం నేపథ్యంలో అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు మరోసారి దెబ్బతింటున్నాయి. సిరియా విషయంలో అమెరికా మెప్పు కోసం ఫ్రాన్స్ ప్రయత్నిస్తోందని, అందుకే ఐక్యరాజ్యసమితి తీర్మానంపై "వీటో" చేసేందుకు తమను లాగుతోందని వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. అక్కడి నుంచి క్రమక్రమంగా రష్యా, ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. 
 
అలాగే అలెప్పోలో యుద్ధ నేరాలకు పాల్పడిన సిరియన్ బలగాలకు సాయం చేసేందుకు రష్యా వైమానిక దాడులు జరుపుతోందని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ ఆరోపించడం.. ఆ తర్వాత ఆయనతో జరగాల్సిన సమావేశాన్ని వ్లాదిమిర్ పుతిన్ రద్దు చేసుకున్నారు. ఇవన్నీ చూస్తే త్వరలోనే పెను యుద్ధ సూచకాలు కనిపిస్తున్నాయని రష్యాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు "స్టానిస్లావ్ బెల్కోవ్‌స్కీ"అన్నారు. ఇకపోతే.. రష్యా ఇప్పటికే అణుక్షిపణుల ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుతిన్ ప్రపంచ యుద్ధం IIIకి రెడీ అవుతున్నారా...? మాస్కోలో కోటి మంది ప్రజలకు బంకర్లు ఎందుకు?