Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతరిక్షంలో వింత.. ఎలుక స్పెర్మ్‌తో 168 పిల్లలు.. ఆరోగ్యంగా పుట్టాయ్!

Advertiesment
Space Mouse
, శనివారం, 12 జూన్ 2021 (17:21 IST)
Rat
అంతరిక్షంలో వింత జరిగింది. అదీ అరుదైన ఘటన. ఆరు సంవత్సరాల పాటు అంతరిక్షంలో ఉన్న ఎలుక స్పెర్మ్ ఉంది. దాన్ని భూమ్మిదకు తీసుకొచ్చి కొన్ని ప్రత్యేక పద్ధతుల ప్రక్రియలతో పిల్లలు కూడా జన్మించటం మరో విశేషం. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో శుక్రవారం (జూన్ 11,2021)న ఈ వార్త ప్రచురించగా అది చదివినవారంతా ఆశ్చర్యపోతున్నారు.
 
2013 లో భూమి మీద నుంచి ఎలుక స్పెర్మ్‌ని అంతరిక్షంలోకి తీసుకుని వెళ్లారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి 2013లో స్పెర్మ్‌ని తీసుకు వెళ్లారు. దాన్ని వ్యోమోగాములు మైనస్ 139 డిగ్రీల ఫారెన్ హీట్ (మైనస్ 95 డిగ్రీల సెల్సియస్) ఫ్రీజర్‌లో భద్రపరిచాయి. దాన్ని దాదాపు ఆరు సంవత్సరాల ( 5 సంవత్సరాల 10 నెలలు) తరువాత 2019 లో స్పేస్‌ఎక్స్ కార్గో క్యాప్సూల్‌లో దాన్ని తిరిగి భూమి మీదకు తీసుకువచ్చారు. 
 
అది తాజాగానే ఉండటంతో దాన్ని మీద పరిశోధనలు చేశారు సైంటిస్టులు. ఆ స్పెర్మ్‌తో పిల్లలు జన్మిస్తాయా?లేదా?అనే ఆలోచనతో ఆ స్పెర్మ్‌ను కొన్ని ప్రత్యేక ప్రక్రియల ద్వారా యత్నించగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఫలితంగా ఆ స్పెర్మ్ నుంచి పిల్లలు జన్మించాయి. ఆ పిల్లలుకూడా చక్కటి ఆరోగ్యంతో ఉండటం సైంటిస్టులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయి.
 
అంతరిక్షం నుంచి తీసుకొచ్చిన ఎలుక స్పెర్మ్‌ని రీప్రొడక్షన్ ప్రాసెస్‌లో ఉపయోగిస్తే ఆరోగ్యకరమైన 168 పిల్లలకి జన్మనిచ్చింది ఆ స్పెర్మ్. ఆ ఎలుకలు ఎలాంటి అనారోగ్యంతో కాకుండా ఆరోగ్యంగా వుండటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Corona: 90వేల దిగువకు కేసులు, 10 లక్షలకు పడిపోయిన క్రియాశీల కేసులు