Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనా బ్రాడ్‌ కంపెనీ రికార్డ్‌ .. 28 గంటల్లో 10 అంతస్థుల భవన నిర్మాణం

Advertiesment
10 Storey Building
, శనివారం, 19 జూన్ 2021 (13:31 IST)
Building
పది అంతస్థుల నిర్మాణాన్ని కేవలం 28 గంటల వ్యవధిలో కట్టారు. నిజంగానే మనుషులు నివసించే 10 అంతస్థుల భవనాన్ని చైనా చాంగ్షాకు చెందిన బ్రాడ్‌ గ్రూప్‌ కంపెనీ తేలికగా కేవలం 28 గంటల్లో నిర్మించింది. కరెంట్‌, వాటర్‌ కనెక్షన్లను కూడా ఇచ్చింది. రికార్డ్‌ సృష్టించింది.

ఈ పది అంతస్తుల బిల్డింగ్‌ నిర్మాణం కోసం బ్రాడ్‌ కంపెనీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ (ముందుగా నిర్మించిన) కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీని ఉపయోగించింది. దీనిలో భాగంగా ఫ్యాక్టరీలో ముందుగానే నిర్మించిన చిన్న విభాగాలను సమీకరించడం ద్వారా నిర్మాణం పూర్తి చేసింది.
 
ఈ 10 అంతస్తుల భవనం నిర్మాణం కోసం ముందుగానే నిర్మించిన కంటైనర్‌ సైజ్‌ బ్లాక్స్‌ను తీసుకువచ్చి.. వాటన్నింటిని ఒకదాని మీద ఒకటి పేర్చారు. బిల్డింగ్‌ నిర్మాణం పూర్తి చేశారు. ఆ తర్వాత బోల్ట్స్‌ బిగించి.. వాటర్‌, కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చారు. ఇక ఈ మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి 28 గంటల 45 నిమిషాల సమయం పట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో ఉంది. వీరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్కులు ధరించడం వల్ల రోగనిరోధకశక్తి బలహీనపడుతుందా?