Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది?

Advertiesment
terrorist

ఠాగూర్

, గురువారం, 5 డిశెంబరు 2024 (16:19 IST)
పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో ఉగ్రాదాడులు జరిగే అవకాశం ఉందని బ్రిటన్ హెచ్చరికలు జారీచేసింది. బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని, ఈ కారణంగానే జన సమ్మర్ధ ప్రాంతాలు, విదేశీయులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాలు, ప్రార్థనా స్థలాల వద్ద ఉగ్రదాడులకు ఆస్కారం ఉందని యూకే హెచ్చరించింది. 
 
ఇటీవల ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయి అరెస్టు చేయగా, ఆ తర్వాత ఆ దేశంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న విషయం తెల్సిందే. హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ తమ పౌరులకు యూకే హెచ్చరికలు జారీ చేసింది. జనసమ్మర్థ ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు, మతపరమైన భవనాలు, విదేశీయులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
 
దేశద్రోహం ఆరోపణలతో గత నెల 25న ఇస్కాన్ ప్రచార కర్త చిన్మయి కృష్ణదాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసిన తర్వాత అక్కడి హిందూ సమాజంపై దాడులు పెచ్చుమీరాయి. అవి క్రమంగా హింసాత్మక రూపు దాల్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన యూకే తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇస్లాంకు విరుద్ధమైన అభిప్రాయాలు, జీవనశైలి కలిగిన వ్యక్తులను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్టు యూకే పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో ముఖ్య నగరాల్లో ఐఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. బంగ్లాదేశ్‌లోని 17 కోట్ల జనాభాలో 8 శాతం మాత్రమే ఉన్న మైనార్టీలపై ఇటీవలికాలంలో 200కుపైగా దాడులు జరిగాయి. చిన్మయిదాస్ అరెస్టు తర్వాత ఢాకా, చిట్టగాంగ్‌లలో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా భద్రతా దళాలకు వారికి మధ్య తోపులాట జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Monkey Rescued Cat: పిల్లిపిల్లను కాపాడిన వానరం.. ఎంత తెలివి? (video)