Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంత మ్యాక్‌బెత్ స్టోరీ ఇష్టమైతే మాత్రం హోం వర్క్‌గా సూసైట్ లేఖ రాయమంటారా?

పాఠం చెప్పే టీచర్ తానేం చెబుతున్నదీ మర్చిపోతే విచక్షణ లేకుండా ఆ లండన్ టీచర్ చేసిన నిర్వాకం లాగే ఉంటుంది. ప్రముఖ ఆంగ్ల రచయిత షేక్స్‌పియర్‌ రాసిన ‘మ్యాక్‌బెత్‌’ కథ టీచర్‌కు బాగా నచ్చి ఉండవచ్చు కానీ దాన్ని ప్రేరణగా తీసుకుని పిల్లలను కూడా ఆత్మహత్య లేఖను

Advertiesment
teacher. give. home. work. suicide
హైదరాబాద్ , సోమవారం, 26 జూన్ 2017 (08:38 IST)
పాఠం చెప్పే టీచర్ తానేం చెబుతున్నదీ మర్చిపోతే  విచక్షణ లేకుండా ఆ లండన్ టీచర్ చేసిన నిర్వాకం లాగే ఉంటుంది. ప్రముఖ ఆంగ్ల రచయిత షేక్స్‌పియర్‌ రాసిన ‘మ్యాక్‌బెత్‌’ కథ టీచర్‌కు బాగా నచ్చి ఉండవచ్చు కానీ దాన్ని ప్రేరణగా తీసుకుని పిల్లలను కూడా ఆత్మహత్య లేఖను హోంవర్క్‌గా రాసుకుని రమ్మని పురమాయిస్తే ఎలా ఉంటుంది. ఉన్న ఉద్యోగం ఊడుతుందంతే..
 
లండన్‌లోని థామస్‌ టాలిస్‌ స్కూల్‌లో చోటుచేసుకుంది ఈ ఘటన. ఓ స్కూల్‌ టీచర్‌ విద్యార్థులని హోంవర్క్‌గా సూసైడ్‌ లేఖ రాయమంది. వివరాల్లోకెళితే.. పాఠశాలలో ఓ టీచర్‌ పిల్లలకు ప్రముఖ ఆంగ్ల రచయిత షేక్స్‌పియర్‌ రాసిన ‘మ్యాక్‌బెత్‌’ కథ వినిపించింది. ఆ నవలలో మ్యాక్‌బెత్‌ పాత్ర ఆత్మహత్య చేసుకుంటుంది.
 
ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ కథ చెప్పి మీరు కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు లేఖ రాసి తీసుకురండి అని ఆ టీచర్ విద్యార్థులకు చెప్పింది. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ధ్వజమెత్తారు. తమ పిల్లలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని కుంగిపోతున్నారని ఆరోపించారు. దాంతో పాఠశాల యాజమాన్యం టీచర్‌ను విధుల నుంచి తొలగించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజల గొప్పతనాన్ని దేశం ముందు చాటుతున్న మన్ కీ బాత్