Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

Advertiesment
Pakistan map

ఐవీఆర్

, బుధవారం, 7 మే 2025 (23:19 IST)
ప్రపంచంలోనే శాంతియుత దేశంగా పేరున్న భారతదేశాన్ని సీమాంతర ఉగ్రవాదులతో అమాయక పౌరులపై పిరికిపంద దాడులు చేస్తూ సహనాన్ని పరీక్షిస్తోన్న పాకిస్తాన్ ముక్కలు చెక్కలయ్యే రోజులు వచ్చేసాయంటున్నారు నిపుణులు. దేశ ప్రజల అభివృద్ధి మానేసి మందుగుండు సామాగ్రి, ఉగ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ పాక్ ప్రజలను బిచ్చగాళ్లలా మార్చేసింది పాకిస్తాన్. ఫలితంగా ఆ దేశంలో సింహభాగం ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. వారికి ఎవరికీ యుద్ధం అవసరంలేదు.
 
ఒకానొక సమయంలో పాక్ పౌరుల్లో చాలామంది తమకు కూడా మోడీ లాంటి ప్రధాని కావాలంటూ బాహాటంగానే చెప్పేశారంటే అక్కడి ప్రజల్లో అసంతృప్తి ఎంతమేరకు వున్నదో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ భూభాగంలో 40 శాతం వున్న బెలూచిస్తాన్, తాము పాకిస్తాన్ దేశంతో కలిసి వుండబోమనీ, తమకు ప్రత్యేక దేశం కావాలంటూ చాలా ఏళ్లుగా కొట్లాడుతోంది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసిందంటున్నారు నిపుణులు.
 
పాకిస్తాన్ దేశం నుంచి విడిపోయి సంతోషకరమైన జీవనం సాగించాలని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో భాగంగా వారు భారతదేశం మద్దతు కోసం ఎదురుచూస్తున్నారు. ఇండియా మద్దతుతో పాకిస్తాన్ దేశం నుంచి తమ ముక్కను తాము తన్నుకెళ్లేందుకు బెలూచిస్తాన్ సిద్ధంగా వున్నట్లు సమాచారం. కనుక వచ్చే 48 గంటల్లో యుద్ధం మాట దేవుడెరుగు పాకిస్తాన్ విచ్ఛిన్నం కాకుండా వుంటే చాలన్న ధోరణిలో అక్కడివారు వున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుకింగ్స్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన లెక్సస్ ఇండియా