Publish Date: Sat, 24 Oct 2026 (16:33 IST)
Updated Date: Sat, 24 Oct 2026 (16:36 IST)
బంగీ జంప్ (Bungee Jump) అంటే కొందరికి భలే సరదా. ఆ సరదాను చూసి మరికొందరు జంప్ చేయాలని సాహసిస్తారు. ఇలాంటి సాహసం కొన్నిసార్లు ప్రాణాల తీస్తుంది. ఓ మహిళ చేసిన బంగీ జంప్ ఆమె ప్రాణాలను కబళించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో... ఓ మహిళ బంగీ జంప్ చేస్తూ పైనుంచి కిందికి దూకింది. తలకిందులుగా వేగంగా వెళ్లి నీటి ఉపరితలాన్ని ఆమె శరీరం తాకింది. ఒక్క క్షణం... ఆమె శరీరం అచేతనంగా మారినట్లు కనిపించింది. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయి ఆమె మృతదేహం తలకిందులుగా తాడుకి వేలాడింది. వెంటనే సిబ్బంది ఆమెను గమ్యస్థానానికి లాగి చూడగా మృతి చెంది కనిపించింది. అందుకే.. సాహసోపేతమైన ఏ క్రీడను కూడా తమాషాగా తీసుకోరాదు.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు.....
Read More