Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15గంటల పాటు లైంగిక వేధింపులు.. శాడిస్టు భర్త నుంచి వివాహితను కాపాడిన కొరియర్ బోయ్!

ఓ శాడిస్టు భర్త నుంచి ఓ వివాహితను కొరియర్ బాయ్ రక్షించాడు. అతడే ప్రస్తుతం అమెరికాలో హీరో అయిపోయాడు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. భర్త నుంచి తప్పించుకునేందుకు భార్య నా

Advertiesment
Woman held captive saved after writing note to UPS driver
, మంగళవారం, 13 డిశెంబరు 2016 (15:31 IST)
ఓ శాడిస్టు భర్త నుంచి ఓ వివాహితను కొరియర్ బాయ్ రక్షించాడు. అతడే ప్రస్తుతం అమెరికాలో హీరో అయిపోయాడు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. భర్త నుంచి తప్పించుకునేందుకు భార్య నానా తంటాలు పడింది. అయినా ఆ భర్త జుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చాడు. చిత్రహింసలు పెట్టాడు. 15 గంటల పాటు దారుణంగా కొట్టాడు. లైంగికంగా వేధించాడు. ఇదంతా అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో గల ఫ్రాంక్లిన్ కౌంటీలో జరిగింది. 
 
తన మూడేళ్ల కుమారుడిని బెడ్రూమ్‌లో నిర్భంధించాడు. మంచినీళ్లైనా ఇవ్వలేదు. తిండి పెట్టలేదు. తలకు తుపాకి పెట్టి.. ఆమెకు కాల్చి.. తాను కాల్చుకుని చస్తానని బెదిరించాడు. అయితే ఆ శాడిస్టు భర్త నుంచి తప్పించుకోవాలనుకున్న ఆ మహిళ కొరియర్ బాయ్‌ సాయం తీసుకుంది. భర్తను వేధిస్తున్న సమయంలో... ఇంటి నుంచి ఓ ప్యాకేజీ తీసుకునేందుకు కొరియర్ బోయ్ వచ్చాడు. 
 
ఆమె అతడితో మాట్లాడుతుండగా.. ఆమె భర్త జేమ్స్ జోర్డాన్ తలుపు వెనక నుంచి ఆమె తలమీద తుపాకి గురిపెట్టి అక్కడే నిలబడ్డాడు. కష్టమ్మీద ఆమె ఆ బాక్సు మీద 'కాంటాక్ట్ 911' అని మాత్రం రాయగలిగింది. ఆ కొరియర్ బోయ్‌కి ఆ సందేశం అర్థమైంది. అక్కడ ఏదీ మాట్లాడకుండా వెళ్ళిపోయిన కొరియర్ బాయ్.. పోలీసులకు ఫోన్ చేసి శాడిస్టు భర్త నుంచి మహిళను కాపాడాడు. కథ సుఖాంతమైంది. 
 
దీంతో కొరియర్ బాయ్ హీరో అయిపోయాడు. ఇతనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేగాకుండా కొరియర్ బాయ్ పనిచేస్తున్న కంపెనీ నుంచి కూడా అతనికి ప్రశంసలు అందుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాక్సిస్ బ్యాంకు లైసెన్స్ క్యాన్సిల్ అంటూ రూమర్లు... కొట్టిపారేసిన ఆర్బీఐ